న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశ ఆర్దిక వ్యవస్ద మందగమనం చిక్కుకుంటోందని, అప్పులు పేరుకుపోతున్నాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపద్యంలో కేంద్ర ఆర్దిక మంత్రి పి. చిదంబరం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును ఈరోజు (శనివారం) సమీక్షించనున్నారు. ఇందుకు గాను చిదంబరం ప్రభుత్వ బ్యాంకుల(పీఎస్‌బీ) అధిపతులతో సమావేశం కానున్నారు.
పీఎస్ బీలతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల ఆస్తులు మరింతగా పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయ రంగానికి రుణసాయం వంటివి ఈ సమావేశంలో చర్చకు రానున్నాయని సమాచారం. చిదంబరం ఈ నెల 1న ఆర్దిక మంత్రిగా వచ్చాక పీఎస్‌బీ సారధులతో భేటీ కావడం ఇదే తొలిసారి. గత ఆర్దిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి పీఎస్ బీలు రూ. 4,75,000 కోట్లు రుణాలను ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించగా.. అవి రూ. 5,09,000 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
పీఎస్‌బీల స్దూల ఆస్తులు గత ఆర్దిక సంవత్సరంలో 3.3 శాతానికి పెరిగాయి. పీఎస్‌బీల అధిపతులతో పాటు నాబార్డ్, సిడ్బీ, ఎస్ హెచ్ బీ, ఐఐ ఎఫ్ సీఎల్, ఎగ్జిం బ్యాంకుల అధిపతులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో ఆర్దిక మంత్రి చిదంబరం సమావేశం | Chidambaram to meet heads of PSU banks | ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో ఆర్దిక మంత్రి భేటీ
Finance Minister P Chidambaram is slated to meet the heads of public sector banks later today. The meeting comes against the backdrop of slowing growth and rising non performing assets of PSU banks.
Story first published: Saturday, August 18, 2012, 12:03 [IST]
Other articles published on
Aug 18, 2012