
ఈ సమావేశానికి డెక్కన్ క్రానికల్‌కు రుణాలు ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్‌ఐసీ, యస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా క్యాపిటల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐఎఫ్‌సీఐ, రత్నాకర్ బ్యాంక్ ప్రతి నిధులు హాజరైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం అనంతరం ఐదుగురు సభ్యులు కలిగిన బృందాన్ని ఏర్పాటు చేసింది. తన బకాయిల వసూలుకు ఉన్న వివిధ మార్గాలను బ్యాంకర్లు, ఆర్దిక సంస్దలు పరిశీలించారు.
ఈ సమావేశంలో ముఖ్యాంశాలు... డెక్కన్ క్రానికల్ మేనేజ్‌మెంట్‌ను మార్చాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ లేదా కంపెనీ లా బోర్డు(సీఎల్‌బీ)ను ఆశ్రయించాలని భావిస్తున్నట్లు తెలి సింది. ఇందుకోసం సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ చట్టాన్ని వినియోగించుకోనున్నట్లు తెలిసింది. డెక్కన్ క్రానికల్ ఆస్తుల కొనుగోలు కోసం ఇప్పటికే బ్యాంకర్లు, డీసీ ప్రమోటర్లు కొన్ని మీడియా గ్రూప్‌లను కలిసినట్లు కూడా తెలిసింది.
డెక్కన్ చార్జర్స్ విక్రయం లేదా డీసీ బ్రాండ్లు, వాటి ఆస్తుల విక్రయం సహా తనఖా పెట్టిన షేర్లను ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌లో కేటాయించడం వంటి అవకాశాలను అన్వేషిస్తున్నారు. డెక్కన్ క్రానికల్‌లో అంతర్గతంగా నిధుల మళ్లింపు జరిగిందా, ఫ్రాడ్‌కు అవకాశం ఎంత, డీసీ ప్రమోటర్ల వ్యక్తిగత ఆస్తుల వివరాలను తెలుసుకొనేందుకు ఫోరెన్సిక్ ఏజెన్సీ లేదా ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లు ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ. 490 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ. 400 కోట్లు, కెనరా బ్యాంక్ రూ 330 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ రూ. 200 కోట్లు, యస్ బ్యాంక్ రూ. 175 కోట్లు, ప్యూచర్ క్యాపిటల్ హోల్టింగ్స్ కు రూ. 170 కోట్లలతో పాటు కార్పోరేషన్ బ్యాంక్, కోటాక్ మహేంద్ర బ్యాంక్, టాటా క్యాపిటల్, ఇండియా బుల్స్ మొదలగున వాటికి రూ. 100 కోట్లు వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు చిన్న చిన్న ఆర్దిక సంస్దలకు రూ. 70 నుండి రూ. 75 కోట్ల వరకు బకాయి పడింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications