ముంబై, ఆగస్టు 16: అభివృద్ధి చెందుతున్న స్టాక్ మార్కెట్లలో దేశీయ స్టాక్ ఎక్సేంజీలకు టాప్ - 5లో స్దానం లభించింది. స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా ముంబై స్టాక్ ఎక్సేంజ్(బిఎస్‌ఈ)కి ప్రపంచ వ్యాప్తంగా 4 వ ర్యాంక్ లభించగా.. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్ఈ)కి 5వ స్దానం లభించింది. జూన్ నెలకు సంబంధించి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజెస్(డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన గణాంకాల ప్రకారం సెబీ ఈ వివరాలను వెల్లడించింది.
బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్ దాదాపు 1,102 బిలియన్ డాలర్లుకాగా, ఎన్‌ఎస్‌ఈ 1,079.4 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రెండు స్దానాలను చైనా దక్కించుకుంది. 2,411 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ (చైనా) తొలి స్థానాన్ని దక్కించుకుంది.
టాప్ 5 అభివృద్ది చెందుతున్న స్టాక్ మార్కెట్లు:
షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ (చైనా) ------ 2,411 బిలియన్ డాలర్లు
షెంన్జన్ స్టాక్ ఎక్స్చేంజ్ (చైనా)--------- 1,149.17 బిలియన్ డాలర్లు
BM&FBOVESPA (బ్రెజిల్)-------- 1,127.24 బిలియన్ డాలర్లు
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
స్టాక్ ఎక్సేంజ్‌ల్లో బీఎస్‌ఈకి 4వ ర్యాంక్, ఎన్‌ఎస్ఈకి 5వ ర్యాంక్ | BSE, NSE among top 5 emerging market bourses: SEBI | మార్కెట్లు: బీఎస్‌ఈకి 4వ ర్యాంక్, ఎన్‌ఎస్ఈకి 5వ ర్యాంక్
Listing out a total of 14 stock exchanges across emerging countries, SEBI said the BSE stood at fourth position and the NSE at fifth among these bourses in terms of cumulative market capitalisation of all their listed companies.
Story first published: Thursday, August 16, 2012, 12:33 [IST]
Other articles published on
Aug 16, 2012