
జులైలో ద్రవ్యోల్బణం 7.25 నమోదు కాగా.. ఆగస్టులో 6.87 శాతంగా నమోదైంది. దీనిని బట్టి చూస్తే ద్రవ్యోల్బణం 0.38 శాతం తగ్గినట్లు లెక్క. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం... 2009 నవంబర్ తర్వాత ద్రవ్యోల్బణం ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతేడాది ఇదే నెలలో ద్రవ్యోల్బణం రేటు 9.36 శాతంగా ఉంది. అయితే, ఆహారోత్పత్తుల ధరల రేటు మాత్రం ఇంకా రెండంకెల్లోనే కొనసాగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది.
జూన్‌తో పోలిస్తే జూలైలో కూరగాయల ధరల జోరు తగ్గుముఖం పట్టింది. జూన్‌లో వార్షిక ప్రాతిపదికన వీటి ధరలు 49% పెరగగా, జూలైలో 24% పెరుగుదల నమోదైంది. మొత్తం ఆహార ద్రవ్యోల్బణం రేటు కూడా 10.81% నుంచి 10.06 శాతానికి తగ్గింది. కాగా, ద్రవ్యోల్బణం శాంతించడం కొంత ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ... 5-6% ఆమోదనీయమైన స్థాయి కంటే ఇంకా అధికంగానే ఉందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications