
'Sahara Q Shop' బ్రాండ్‌తో మొట్టమొదట 300 స్కేర్ ఫీట్‌లలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్‌లోని 60 పట్టణాల్లో ఈనెల 15 నుంచి రిటైల్ అవుట్‌లెట్లు ప్రారంభంకానున్నాయి. 'Sahara Q Shop' లలో 73 విభాగాలకు(పుడ్స్, ప్రోడక్ట్ ఉత్పత్తులు, కేర్ ఉత్పత్తులు) చెందిన వస్తువులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
మార్చి 2013కల్లా భారతదేశం మొత్తం మీద 998 పట్టణాలలో ఈ 'Sahara Q Shop' రిటైల్ అవుట్ లెట్లను ప్రారంభిస్తామన్నారు. మొదటి 12-18 నెలలో ఆదాయం రూ. 15,000-20,000 కోట్లు కాగా.. రాబోయే రెండు సంవత్సరాలలో రూ 50,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. కల్తీ నివారణ, ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా నాణ్యమైన వస్తువుల విక్రయానికి సంకల్పించామని, హైదరాబాద్ సహా లక్నో, ఢిల్లీ, ముంబై, పాట్నా, కోల్‌కతా, నాగపూర్‌లో నాణ్యత పరీక్షలకు సంబంధించి ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.
రిటైల్ వస్తువుల్లో నాణ్యతలో లోపాలు చూపిస్తే రూ.5 లక్షలదాకా పరిహారం ఇస్తామన్నారు. రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా ఏడాదిన్నరలో లక్షా 43 వేల మందికి పర్మనెంటు ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications