ముంబై, ఆగస్టు 13: స్టాక్ మార్కెట్‌లో సోమవారం ట్రేడింగ్ లాభాలతో ముగిశాయి. ఈ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ 76 పాయింట్ల లాభంతో 17,633 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 27 పాయింట్ల వృద్ధితో 5,348 వద్ద ఆగి పోయింది. సెంట్రల్ బ్యాంకు ప్రధాన పాలసీ రేట్లను సడలించడం ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు కావొచ్చన్న సెంటిమెంట్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. దీంతో స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి.
ఈ ట్రేడింగ్‌లో స్టెరిలైట్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, భెల్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, ఎల్ అండ్ టి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా పవర్, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీల షేర్లు లాభపడగా, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందుస్థాన్ లీవర్, హీరో మోటార్‌కార్ప్, హిండాల్కో, టాటా స్టీల్, టీసీఎస్, ఐసీఐసీ బ్యాంకు కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి.
ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే మిశ్రమంగా ఉన్నాయి. గత శుక్రవారం యూరోప్ మార్కెట్లు నష్టపోగా.. అమెరికా మార్కెట్లు లాభపడ్డ విషయం తెలిసిందే. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. చైనా ఆర్దిక వ్యవస్ద నుండి వచ్చిన ప్రతికూల వార్తలతో ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపారు.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
సోమవారం (ఆగస్టు 13) : 76 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ సూచీ | Markets end the day higher; HDFC surges | సోమవారం: 76 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ సూచీ
Markets ended the day higher today, in line with European markets, which were trading higher. The Sensex closed the day higher by 75 points, while the Nifty ended the day at 5348 points, gaining 27points.
Story first published: Monday, August 13, 2012, 18:41 [IST]