ర్యాన్‌బ్యాక్సీ లేబరేటరీస్‌ Q2 నష్టం రూ.580 కోట్లు

Ranbaxy Laboratories posts Q1 loss of Rs 586 crore
న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రముఖ ఔషధ దిగ్గజం ర్యాన్‌బ్యాక్సీ లేబరేటరీస్‌ ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన క్వార్టర్‌కు రూ.580 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టాలు వచ్చాయని గురవారం తెలిపింది. ఇందుకు గల కారణాలను తెలియజేస్తూ విదేశీ మారక ద్రవ్య నష్టాలే అని చెప్పింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.245.53 కోట్లు కాగా నికర అమ్మకాలు మాత్రం రూ.2,054 కోట్ల నుంచి రూ.3,174 కోట్లకు పెరిగాయని తెల్చింది.

విదేశీ మారక ద్రవ్యం పరంగా గత ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.112 కోట్ల లాభం రాగా ఈ ఏడాది ఇదే క్వార్టర్‌కు రూ.599 కోట్ల నష్టం వచ్చింది. డాలర్ బలపడడం వర్థమాన దేశాల్లో అమ్మకాలపై ప్రభావం చూపింది. రూపాయి బలహీనపడడం తమ ఎగుమతి వ్యాపారానికి అనుకూలమే అయినప్పటికీ, ఖాతాల్లో డెరివేటివ్స్‌ను మార్క్ టు మార్కెట్‌కు చూపించడం వల్ల, విదేశీ కరెన్సీ రుణాల వల్ల తమకు నష్టాలు వచ్చాయని కంపెనీ పేర్కొంది.

దీంతో బీఎస్‌ఈలో గురవారం నాడు ర్యాన్‌బ్యాక్సీ లేబరేటరీస్‌ షేర్ 2.96 శాతం క్షీణించి రూ.500.10 వద్ద ట్రేడ్‌ అయింది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+