మార్కెట్ కబుర్లు: లాభాల్లో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు

స్టాక్స్ విషయానికి వస్తే నిప్టీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, కోల్ ఇండియా లాభపడ్డాయి. ఈరోజు రిజల్ట్స్ విడుదల చేయడంతో టాటా మోటార్స్ 0.85% శాతం లాభపడింది. బుధవారం నాడు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించిన రిజల్డ్స్‌ని బట్టి ఈరోజు స్టాక్ మార్కెట్లో 3.32 శాతం నష్టపోయింది. ఇండియా బుల్స్ గ్రూప్ షేర్స్ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమంగా ఉన్నాయి.
ప్రపంచ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. వరుసగా మూడు రోజులు పెరగడంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తోంది. యూరోప్, అమెరికా మార్కెట్లు కొంత నష్టపోయాయి. ఫ్రాన్స్ సూచీ 0.44 శాతం కోల్పోగా, జర్మనీ, బ్రిటన్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్ 0.15 శాతం కోల్పోయింది. డౌజోన్స్ ఫ్లాట్‌గా ముగిసింది.
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు చాలా వరకు లాభాల్లో ఉన్నాయి. తైవాన్, దక్షిణ కొరియా సూచీలు ఒక శాతానికి పైగా లాభపడుతున్నాయి. సింగపూర్, షాంఘై సూచీలు నష్టాల్లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టీ 20 పాయింట్ల దాకా లాభపడుతూ 5,370కి సమీపంలో ట్రేడవుతోంది. మన మార్కెట్లో ఈవాళ టాటా మోటార్స్, ర్యాన్‌బ్యాక్సీ ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications