మార్కెట్ కబుర్లు: లాభాల్లో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు

Markets trade flat; Bharti down post results
ముంబై, ఆగస్టు 8: ఆసియా మార్కెట్లు 3 నెలల గరిష్ట స్దాయిలో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.00 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ 63 పాయింట్లు లాభపడుతూ 17,665 పాయింట్ల సమీపంలో ట్రేడ్ అవుతుండగా.. నిప్టీ 18 పాయింట్లు దాకా లాభపడుతూ 5,355 సమీపంలో ట్రేడ్ అవుతుంది. సన్ ఫార్మా, కోటక్ మహేంద్రా సంస్దలు టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి.

భారతీ ఎయిర్ టెల్ షేర్లు 1శాతం తగ్గుముఖం పట్టగా.. ఆ తర్వాత గెయిల్, మారుతి సుజుకీ ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ గా టాటా స్టీల్, టాటా మోటార్స్ ఉన్నాయి. శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నెంబర్స్‌ను విడుదల చేస్తుండడంతో 1శాతం వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ఎగబాకింది. ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ఉన్నాయి.

సెంట్రల్ బ్యాంకుల నుండి స్టిమ్యులస్ ప్యాకేజీలు వస్తాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతున్నారు. యూరోప్ మార్కెట్లలో ఫ్రాన్స్ సూచీ ఒకటిన్నర శాతం లాభపడింది. దీనితో పాటు జర్మనీ 0.7 శాతం, బ్రిటన్ 0.5 శాతం పెరగగా.. అమెరికా మార్కెట్లలో డౌజోన్స్ 0.4 శాతం, నాస్ డాక్ 0.8 శాతం లాభపడ్డాయి.

జపాన్, దక్షిణ కొరియా సూచీలు ఒకటిన్నర శాతం దాకా లాభపడగా.. సింగపూర్ నిప్టీ 20 పాయింట్లు దాకా పెరుగుతూ 5,360కు సమీపంలో ట్రేడవుతోంది. మార్కెట్లో నగదు ప్రవాహం ఉన్నందున నిప్టీ 5,450 నుండి 5,500ల వరకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+