2012-13 ఆర్దిక సంవత్సరంలో వృద్ధి రేటు 5.5 శాతం: క్రిసిల్

టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ముందుగా అంచనా వేసిన 7 శాతం బదులు 8 శాతం వరకు పెరుగుతుందని తెలిపింది. వాతావరణశాఖ గణాంకాల ప్రకారం వర్షపాతం జూన్ - సెప్టెంబర్ 2012 కాలానికి 15 శాతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. స్టాండర్డ్ అండ్ పూర్స్ కూడా ఇటీవల యూరోజోన్ వృద్ధిరేటు (-)0.6 శాతంగా ఉంటుందని సవరించింది. అంతకు ముందు ఎలాంటి పెరుగుదల ఉండదని పేర్కొంది.
మరోపక్క త్రైమాసిక సమీక్షలో రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 7.3% నుంచి 6.5%కు కుదించింది. కాగా, గ్లోబల్ రేటింగ్ దిగ్గజం ఎస్‌అండ్‌పీ యూరో జోన్ ఆర్థిక వ్యవస్థ 0.6% క్షీణించవచ్చునని అంచనా వేసింది. క్షీణిస్తున్న యూరోజోన్ పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు తగ్గవచ్చునని క్రిసిల్ అంచనా వేసింది.
ద్రవ్యలోటు పెరగడానికి ప్రధాన కారణం జీడీపీ వృద్ధిరేటు మందగించడం వల్ల రెవెన్యూ వసూళ్లు తగ్గుముఖం పడతాయి. ఒక వేళ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉద్దీపన పథకాలను ప్రవేశపెట్టకపోతే జీడీపీలో ద్రవ్యలోటు మరింత పెరిగిపోతుందని క్రిసిల్ నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం కేంద్రప్రభుత్వం చమురుపై పెద్ద ఎత్తున సబిడ్సీ ఇవ్వడంతో ద్రవ్యలోటు 5.76 శాతానికి పెరిగిపోయింది. ప్రభుత్వం డీజిల్‌పై నియంత్రణ విధించలేకపోతోంది. ఏప్రిల్ - జూన్ కాలంలో ద్రవ్యలోటు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగిపోయింది.
2012-13 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా విధించుకున్న దాంట్లో 37.1 శాతానికి చేరింది. ద్రవ్యలోటు జీడీపీలో 6.2%కు చేరవ చ్చునని క్రిసిల్ అంచనా వేసింది. తొలుత 5.8% ద్రవ్యలోటును అంచనా వేసింది. జీడీపీ నెమ్మదించడం వల్ల ఆదాయం తగ్గుతుందని తద్వారా ద్రవ్యలోటు పెరుగుతుందని వివరించింది. ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపడితే మదుపరుల్లో విశ్వాసం కల్పిస్తే వృద్ధిరేటు పుంజుకునే అవకాశం ఉందని క్రిసిల్ నివేదికలో వివరించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications