
ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో రూ.9,938 కోట్ల(179 కోట్ల డాలర్లు)ఆదాయం ఆర్జించి కాగ్నిజంట్ ఈ ఘనత సాధించింది. ఇదే క్వార్టర్‌కు ఇన్ఫోసిస్ రూ.9,716 కోట్లు(175 కోట్ల డాలర్లు) ఆదాయం సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం విషయంలో మూడో పెద్ద భారత ఐటీ కంపెనీగా విప్రోను తోసిరాజని కాగ్నిజంట్ దూసుకెళ్లింది.
ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో నికర లాభం 21 శాతం వృద్ధి చెంది 25.19 కోట్ల డాలర్లకు పెరిగిందని కాగ్నిజంట్ తెలిపింది. జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని ఈ కంపెనీ పాటిస్తోంది. కాగ్నిజంట్ భారత్‌లో లిస్ట్‌కానప్పటికీ, మొత్తం 1.45 లక్షల ఉద్యోగుల్లో మూడొంతులు ఇక్కడే పనిచేస్తున్నారు. ఈ సందర్బంలో కంపెనీ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాన్సికో డిసౌజా మాట్లాడుతూ క్లయింట్స్ మాపై నమ్మకం ఉంచడం వల్లే సకాలంలో వారి ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతున్నామన్నారు. ముఖ్యంగా సోషల్, మొబైల్, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో బిజినెస్ బాగా రాణించిందన్నారు.
ఛీప్ ఫైనాన్స్ ఆఫీసర్ కరెన్ మెక్ లోఫ్లిన్ మాట్లాడుతూ మేము ఊహించిన విధంగా మా పూర్తి సంవత్సరం ఆదాయం మార్గదర్శకత్వంగా నిర్వహించడానికి గర్వంగా ఉందన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications