ఇండియన్ వింగ్ బాక్స్‌తో లాకీడ్ మార్టిన్స్ సి - 130

పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహానిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇప్పటికే ప్రైవేట్ రంగం నుంచి 1.30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా ప్రభుత్వ రంగ సంస్థలు 1.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఇందులో 15 యూ నిట్లు ఉత్పత్తిని ప్రారంభించటంతో 25 వేల మందికి ఉపాధి లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం యూనిట్లన్ని అందుబాటులోకి వస్తే మరో 65 వేల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి పారిశ్రామిక రంగాన్ని కోరారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రజల నుంచి అవసరమైన భూమిని సేకరిస్తున్నామని, ఇందుకు ప్రతిఫలంగా వారికి ఆయా సంస్థల్లో ఉపాధి అవకాశాలను కల్పించితే బాగుంటుందని ఆయన సూచించారు.
త్వరలో విద్యుత్ పరిస్థితి మెరుగు... విద్యుత్ సమస్య ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లేదని, ఇది దేశమంతా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వర్షాభావ పరిస్థితులు, గ్యాస్ కొరతతో రాష్ట్రంలో భారీగా విద్యుత్ కొరత ఏర్పడిందని, త్వరలోనే పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
భారత్ నుంచి మరో 6 ఆర్డర్లు : జార్జ్ షుల్జ్ భారత్ నుంచి మరో ఆరు హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్లను అందుకోవచ్చని చూస్తున్నట్లు లాకీడ్ మార్టిన్ సి-130 ప్రొగ్రా మ్స్ వైస్ ప్రెసిడెంట్ జార్జ్ షుల్జ్ చెప్పారు. టాటా లాకీడ్ మార్టిన్‌లో అభివృద్ధి చేసిన భాగాలనే ఈ సి-130 ఎయిర్‌క్రాఫ్ట్‌లో వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో యుఎస్‌లోని మేరీల్యాండ్ నుంచి భారత్‌కు ఆరు ఎయిర్‌క్రాఫ్ట్‌లను డెలివరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరో 15 దేశాలు కూడా సి-130 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లను ఇచ్చాయని షుల్జ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం సి-130 సెంటర్ వింగ్ బాక్స్‌ను డెలివరీ చేసినట్లు టాటా లాకీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ చైర్మన్ రామ దొరై చెప్పారు. ప్రస్తుతం కంపెనీలో 700 మంది నిపుణులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యువ ఇంజనీర్లకు శిక్షణనివ్వటానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేసినట్లు దొరై వివరించారు.


Click it and Unblock the Notifications