గృహ, కార్ల రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

వీటితో పాటు రూ. 30 లక్షల నుండి రూ.75 లక్షల లోపు రుణాలపై వడ్డీరేట్లను 10.75 శాతం నుండి 10.40 శాతానికి, రూ.75 లక్షలు ఆపైన రుణాలకు వడ్డీరేటుని 11 శాతం నుండి 10.40 శాతానికి తగ్గించింది. తగ్గించిన ఈ ధరలు అన్నీ కూడా ఆగస్టు 7 నుండి అమలులోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వడ్డీ రేటు తగ్గింపు వలన రూ. 30 లక్షలలోపు రుణం తీసుకున్న వారికి ప్రతి లక్షపైన ఈఎంఐ భారం రూ. 17, అదే రూ.75 లక్షలు దాటిన వారికి ప్రతి లక్షకి రూ. 40 తగ్గుతుంది.
ఇక కార్ లోన్స్ విషయానకి వస్తే ప్రస్తుతం కార్‌లోన్స్‌పై 11.25 శాతంగా ఉన్న వడ్డీరేటులో అర శాతం తగ్గించి 10.75 శాతానికి తీసుకొచ్చింది. ఏడేళ్ల వ్యవధికి గాను ఎస్‌బీఐలో కార్‌లోన్ తీసుకుంటే గతంలో రూ.లక్షకు రూ.1,725 ఈఎంఐ చెల్లించాల్సి వస్తే.. ఇప్పుడా భారం రూ.1,699 తగ్గుతోంది. ఆర్‌బీఐ తొలి త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎస్‌బీఐకి అదనంగా రూ.16,500 కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయి. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్) 24% నుంచి 23 శాతానికి తగ్గించడం వలన రూ.10,000 కోట్లు, ఎక్స్‌పోర్ట్ రీ-ఫైనాన్సింగ్ తగ్గింపు వలన రూ.6,500 కోట్లు అందుబాటులోకి వస్తాయని ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి చెప్పారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications