యూఏఈ ఎక్స్‌ఛేంజ్: రాబోయే రెండు సంవత్సరాలలో 500 బ్రాంచీలు

మనీ ట్రాన్స్‌ఫర్, ఫారన్ ఎక్ఛేంజ్, ఏయిర్ టికెటింగ్ అండ్ టూర్స్, గోల్డ్ లోన్, వెహికల్ లోన్, మోటార్ ఇన్సూరెన్స్ తదితర రంగాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థ తన కొత్త కస్టమర్ల కోసం ‘విన్ విన్ విన్' పేరుతో సరికొత్త పథకం ప్రకటించింది. ఈ పథకం ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఉంటుందని వర్గీస్ మాథ్యూ తెలిపారు. భారత్‌లో తమ కస్టమర్లకు ఈ మూడు నెలల్లొ ప్రతినెలా ఒక టయోటా కారు, ఎల్‌సిడి టివితో పాటు ప్రతిరోజు ఒక బంగారు నాణం గెలుచుకునే అవకాశం ఉందన్నారు.
ప్రతీ నెల రూ.300 కోట్ల విలువైన 2 లక్షలకుపైగా లావాదేవీలు చేపడుతున్నామన్నారు. ఎస్‌బీహెచ్, యాక్సిస్ వంటి బ్యాంకులతో సహా దేశంలో కంపెనీకి 38 వేల ఏజెంట్లు ఉన్నారని వివరించారు. సంస్థ మనీ ట్రాన్స్‌ఫర్ వ్యాపారంలో రాష్ట్ర వాటా 15% ఉంటుందని కంపెనీ రీజినల్ హెడ్ గోపి చెప్పారు. దుబాయి, సౌదీ నుంచి రెమిటెన్స్‌లు ఎక్కువని... కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ఎక్కువమంది తమ కుటుంబాలకు డబ్బు పంపిస్తుంటారని ఆయన చెప్పారు. ఏ దేశం నుంచైనా డబ్బు డిపాజిట్ చేసిన నిమిషాల్లోనే ఇక్కడివారికి అందుతుందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications