
మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - కార్వీ చేసిన ఫిర్యాదుపై నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మతో డీసీపీ జాన్ విక్టర్ చర్చించినట్లు తెలిసింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా, వద్దా అనే అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. పోలీసులకు న్యాయపరమైన సలహా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో అసలు ఫిర్యాదు ఏమై ఉంటుందనే విషయంపై రకరకాల ఊహగానాలు వినవస్తున్నాయి.
దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్‌గా కార్వీ గ్రూప్ వ్యవహరిస్తోంది. ఈ అనుబంధంతోపాటు కార్వీ గ్రూప్‌లోని మరో సంస్థ నుంచి డీసీ హోల్డింగ్స్ ప్రమోటర్లు రూ. 50 కోట్ల వరకు మేర సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాలను కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ రుణాలకు సంబంధించి సెక్యూరిటీగా అందజేసిన ఆస్తుల పత్రాల్లో కొన్ని ఫోర్జరీవి ఉన్నట్లు కార్వీ తమ ఫిర్యాదులో ఆరోపించినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే డీసీ హోల్డింగ్స్‌కు వ్యతిరేకంగా ప్రముఖ ఆర్థిక సంస్థ ఐఎఫ్‌సీఐ 'వైండింగ్ అప్' పిటిషన్ దాఖలు చేసింది.
డిబెంచర్ల రిడెంప్షన్‌కు సంబంధించి 27.8 కోట్ల రూపాయలను చెల్లించడంలో డీసీ విఫలమైందని ఆరోపిస్తూ ఐఎఫ్‌సీఐ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. దక్కన్ క్రానికల్ ఆర్థిక పరిస్థితిపై తన పిటిషన్‌లో తీవ్రమైన ఆరోపణలే చేసింది. "వేల కోట్ల అప్పులు చేసిన ఈ సంస్థ... వాటిని తిరిగి చెల్లించే పరిస్థితుల్లో లేదు. అందువల్ల... దానిని మూసేసి, ఆస్తులు అమ్మి మా సొమ్ములు ఇప్పించండి'' అని హైకోర్టును కోరింది.
ఇదిలావుంటే, డీసీ ప్రమోటర్లు 54 శాతం వాటాను ఫ్యూచర్స్ క్యాపిటల్ వద్ద తాకట్టు పెట్టడం కంపెనీ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలకు బలం చేకూర్చింది. వరుసగా వస్తున్న ప్రతికూల వార్తలతో డీసీ హోల్డింగ్స్ షేరు ధర మంగళవారం మరో కొత్త కనిష్ఠ స్థాయి 15.45 రూపాయలకు దిగజారింది. గత 15 రోజుల్లో ఈ షేరు ధర దాదాపు 50 శాతంమేర పతనమైంది.
మార్కెట్ పరిస్థితి దక్కన్ క్రానికల్ గ్రూప్‌నకు పూర్తి అడ్డంగా తిరిగిన సమయంలోనే కార్వీ కూడా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, కార్వీ ప్రతినిధులు మాత్రం తాము డీసీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఆ గ్రూప్‌తో తమకు ఆర్థిక లావాదేవీలేమీ లేవని చెప్పినట్లు వార్తాకథనాలు చెబుతన్నాయి.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications