కీలక వడ్డీ రేట్లు యధాతథంగా: దువ్వూరి సుబ్బారావు

RBI keeps policy rates unchanged; maintains hawkish tone
ముంబై, జులై 31: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్లీ నిరాశ పర్చింది. దేశంలో కీలక వడ్డీ రేట్లు యధాతథంగా ఉంటాయని ప్రకటించింది. వివరాల్లోకి వెళితే మంగళవారం ముంబైలో ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిగింది. అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని స్ఫష్టం చేశారు. నగదు నిల్వల నిష్పత్తి ఒక శాతం తగ్గించినట్లు ఆయన తెలిపారు.

ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున వడ్డీ రేట్లు తగ్గించలేక పోతున్నామని గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తే ధరలు మరింతగా పెరుగుతాయని ఆయన భావించారు. 2012- 2013 ఆర్దిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని.. ఇది 6.5 నుండి 7 శాతం వరకు పెరిగే సూచనలు ఉన్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

వడ్డీ రేట్లు యధాతథంగా ఉంచినప్పుటికీ చట్టబద్ద నగదు నిష్పత్తి ఎస్ ఎల్ ఆర్ ను 24 నుండి 23 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల ఆర్దిక వ్యవస్దలో నిధుల లభ్యత పెరుగుతందని ఆర్‌బీఐ భావిస్తోంది. మరోవైపు ఈ ఏడాది జీడీపీ వృద్ది రేటు అంచనాను 7.3 శాతం నుండి 6.5 శాతానికి తగ్గించింది. జీడీపీ వృద్దిరేటు అంచనా తగ్గడమంటే కొత్త ఉద్యోగాలు ఆశించిన స్దాయిలో రావని, వేతనాలు పెరుగుదల మందగిస్తుందని అర్దం. ద్రవ్యోల్బణం అంచనా పెరిగింది అంటే ధరలు పెరుతాయన్నామాట. దేశ ఆర్దిక వ్యవస్దపై అంతర్జాతీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+