ముంబై, జులై 30: సోమవారం స్టాక్ మార్కెట్లు బెంచ్ మార్క్‌ను దాటి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాన్నం 3 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సెన్సెక్స్ 261 పైగా లాభపడుతూ 17,100 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిప్టీ మాత్రం 84 పాయింట్లకు పైగా లాభపడుతూ 5,184 వద్ద ట్రేడ్ అవుతుంది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనించడానికి గల కారణం రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ పెరగడంతో పాటు సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశం ఉండడంతో బయ్యర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు.
దేశంలోని రుతుపవనాల పరిస్థితి కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ వారం ఆటోమొబైల్, సిమెంట్ షేర్లపై మదుపరుల దృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంది. దీనికి కారణం ఆగస్టు 1వ తేదీన సిమెంట్, ఆటోమొబైల్‌ల నెలవారి గణాంకాలు వెల్లడవుతుండమే. డీజిల్ ధరలతో పాటు కమాడిటీ ధరలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటీకే ద్రవ్యోల్బణం 7.5 శాతంగా ఉందని ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించేందుకు నిరాకరిస్తోంది.
రుతుపవనాలు మందగించడంతో పాటు ప్రభుత్వం సంస్కరణలు అమలు చేయడంలో విఫలం కావడం కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కార్పొరేట్ల ఫలితాల విషయానికి వస్తే బ్యాంకు ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంకు, ఐవోబీ, అలహాబాద్ బ్యాంకు, పీటీసీ ఇండియా, స్పయిస్‌జెట్, గెయిల్ ఇండియాల క్యూ1ల ఫలితాలు సోమవారం విడుదలవగా... జయప్రకాశ్ అసోసియేట్స్, సిప్లా ఫలితాలు మంగళవారం నాడు విడుదలవుతాయి.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
ఆర్‌బీఐ పాలసీ రివ్యూ: 250 పాయింట్లు పైగి ఎగబాకిన సెన్సెక్స్ | Sensex rallies 250 points ahead of RBI policy review | 250 పాయింట్లు పైగి ఎగబాకిన సెన్సెక్స్
A benchmark index of Indian equities markets rallied over 1.5 percent in the afternoon trading Monday, led by strong buying support in interest rate sensitive banking, realty and capital goods stocks, ahead of monetary policy review by the central bank.
Story first published: Monday, July 30, 2012, 15:10 [IST]
Other articles published on
Jul 30, 2012