
గత ఏడాది ఇదే కాలంలో రూ.1,332.72 కోట్లు నమోదు చేసిందని ఐటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. సిగరెట్ అమ్మకాలు తప్పించి మిగతా రంగాలకు చెందిన కంపెనీ వ్యాపారాలు బాగా పుంజుకున్నాయి. అమ్మకాల విషయానికి వస్తే ఏప్రిల్ - జూన్ త్రైమాసానికి రూ.6,522.21 కోట్లకు చేరగా.. గత ఏడాది ఇదే కాలంలో రూ.5,767.47 కోట్లని ప్రకటనలో పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ రంగం నుంచి వీటిలో సిగరెట్లు కలుపుకుని రెవెన్యూ 4,777.29 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.4,071.32 కోట్లని తెలిపింది.
సిగరేట్‌యేతర వ్యాపారం విషయానికి వస్తే ప్యాకేజ్‌ఫుడ్, పర్సనల్ కేర్, ఎడ్యూకేషన్, స్టేషనరీ రంగాల నుంచి రూ.1,473.05 కోట్ల రెవెన్యూ సాధించింది. గత ఏడాదితో పోల్చుకుంటే రెవెన్యూలో ఇది 22.98 శాతం వృద్ధి. సిగరెట్ల నాణ్యత పెంచేందుకు కంపెనీ మరింత పెట్టుబడులు పెట్టింది. సిగరెట్ల రంగం నుంచి రూ.3,304.24 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. ఐతే శ్రీలంకలో ఐదు నక్షత్రాల హోటల్ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వంతో 99 ఏళ్ల లీజు కుదుర్చుకుంది.
పేపర్ బోర్డులు, ప్యాకేజింగ్ వ్యాపార ఆదాయం రూ 960 కోట్ల నుంచి రూ 1,036 కోట్లకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని భద్రాచలం పేపర్ బోర్డుల తయారీ ప్లాంట్ విస్తరణ, అదేవిధంగా హరిద్వార్‌లో కొత్త అట్టపెట్టెల(కార్టన్స్) యూనిట్ నిర్మాణం వచ్చే మార్చికల్లా పూర్తికానున్నాయని వెల్లడించింది. ఆగ్రి బిజినెస్ (వ్యవసాయ) ఉత్పత్తుల వ్యాపారం ద్వారా రెవెన్యూ రూ.1,691.42 కోట్లకు చేరగా గత ఏడాది రూ.1,707.14 కోట్లని ఐటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి కారణం పొగాకు పెద్ద ఎత్తున కొనుగోలు చేసిపెట్టుకోవడం కమాడిటీ మార్కెట్‌లో దీని ప్రభావం పడటంతో రెవెన్యూ తగ్గిందని వివరించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications