
ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్‌ను ప్రచురించడంతో పాటు ఐపియల్ క్రికెట్ టీమ్ దక్కన్ చార్జర్స్‌కు ఈ కంపెనీ యజమాని. ఇటీవలి కాలంలో రుణాల చెల్లింపులకు సంబంధించి కంపెనీ రేటింగ్‌ను కేర్ తగ్గించడం, దక్కన్ చార్జర్స్‌లో వాటా విక్రయించేందుకు యాజమాన్యం సిద్ధపడటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ ఎండి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.
తాజా పరిణామంతో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ షేరు ధర బుధవారం మార్కెట్లలో కనిష్ట స్థాయికి దిగజారింది. బిఎస్ఇలో ఏడాది కనిష్ట ధర అయిన రూ. 24.80 (షేరు ముఖ విలువ రూ.2) నమోదై, తర్వాత స్వల్పంగా కోలుకుని రూ.25.15 ముగింపు ధరను నమోదు చేసింది. క్రితం రోజు ముగింపు కన్నా ఇది 2.33 శాతం క్షీణత. గత నెల రోజుల్లో ఈ షేరు గరిష్ట్ ధర బిఎస్ఇలో రూ.33.40 కాగా, తాజాగా రూ. 25.15కు పడిపోయింది.
స్వల్పకాలిక రుణాలకు సంబంధించి దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ తిరిగి చెల్లింపులు చేయలేకపోయిందని, దాంతో దీని రేటింగ్ డిఫాల్ట్ గ్రేడ్‌కు తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రముఖ రేటింగ్ సంస్థ కేర్ వెల్లడించింది. స్వల్పకాలిక నాన్ - కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎస్‌సిడీ)ని కంపెనీ పూర్తిగా చెల్లించలేదని, నిరుడు డిసెంబర్ 31వ తేదీ నాటికి కంపెనీ ఖాతాల ప్రకారం బ్యాంకుల్లో నగదు, ఎఫ్‌డీలు రూ. 372 కోట్లు ఉన్నట్లు కనిపించినా డిబెంచర్లను తిరిగి చెల్లించలేకపోవడానికి తగిన కారణాన్ని చూపలేదని కేర్ వ్యాఖ్యానించింది. ఏడాది క్రితం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ.500 కోట్లకు ఎస్సిడీలు జారీ చేసింది. ప్రమోరికా, టారస్ తదితర సంస్థలు ఇందులో పాల్గొని నిధులు సమకూర్చాయి.
ఇందులో మెజారిటీ మొత్తాన్ని చెల్లించినా కూడా ఇంకా కొంత మేరకు చెల్లింపులు మిగిలిపోయినట్లు వార్తాకథనాలు వచ్చాయి. దీంతో స్వల్పకాలిక రుణ రేటింగ్ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోందంటూ మీడియా వ్యాఖ్యానించింది. మరోవైపు ఒడిస్సీ పేరుతో నిర్వహిస్తున్న బుక్ స్టోర్లను, వాటి కార్యకలాపాలను దక్కన్ క్రానికల్ ఇటీవలి కాలంలో చాలా వరకు తగ్గించింది. ఒడిస్సీ స్టోర్లు నిర్వహించే సంస్థను తొమ్మిదేళ్ల క్రితం దక్కన్ క్రానికల్ కొనుగోలు చేసింది. తర్వాత దీన్ని దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌లో విలీనం చేసింది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications