
ఫేస్‌బుక్‌కు భారతదేశం అతి పెద్ద మార్కెట్లలో ఒకటని, 2010 సంవత్సరంలో తాము హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించే నాటికి తమ యూజర్ల సంఖ్య 80 లక్షలు కాగా ఇప్పుడు వారి సంఖ్య ఐదు కోట్లకు పెరిగిందని ఆమె చెప్పారు. ఫేస్‌బుక్ సాధారణ ప్రజలకు కూడా ఒక కస్టమైజ్డ్ న్యూస్‌పేపర్ తరహాలో ఉపయోగపడుతూ వారికి అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నదని ఆమె తెలిపారు. భారతదేశంలో డెస్క్‌టాప్ ద్వారా ఫేస్‌బుక్ యాక్సెస్ చేసే వారి కన్నా మొబైల్ ద్వారా యాక్సెస్ చేసే వారి సంఖ్యే ఎక్కువ ఉన్నదని కూడా ఆమె చెప్పారు. ఈ కారణంగానే అధిక సంఖ్యలో మొబైల్ కంపెనీలు తమ అప్లికేషన్లలో ఫేస్‌బుక్‌ను తప్పనిసరిగా ఉంచుతున్నాయని ఆమె అన్నారు. ఫేస్‌బుక్ ద్వారా భారత్‌లో ప్రస్తుతం 90 వేల కోట్ల స్నేహవారధులున్నాయని ఆమె చెప్పారు.
మహిళలు తమ శక్తి తెలుసుకోవాలి మహిళల్లో సాధికారత తీసుకురావాలంటే వారి శక్తి ఏమిటో వారికి తెలిసేలా చైతన్యవంతులను చేయడం అవసరమని అంతకు ముందు ఐఎసిసి గోష్ఠిలో మాట్లాడిన సందర్భంగా కీర్తిగ రెడ్డి అన్నారు. సాధారణంగా మహిళలు తమ శక్తిని తక్కువ అంచనా వేసుకుంటారని, ఆ శక్తి వెలుపలికి వచ్చే వాతావరణం కల్పించినట్టయితే వారు తిరుగులేని నాయకులుగా ఎదుగుతారని ఆమె అన్నారు.
మహిళలు కుటుంబ బాధ్యతలను, ఉద్యోగ బాధ్యతలను సమతూకం చేసుకోవలసి ఉంటుందని అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అన్నారు. కార్పొరేట్ కంపెనీలు మహిళలకు అత్యున్నత పదవులు అందించడంలో వెనుకడుగేయడానికి ఆయా రంగాల్లో ఉన్న నిపుణుల కొరత కూడా కారణమని అభిప్రాయపడ్డారు. 15 సంవత్సరాల క్రి తం తాము హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రా డ్యుయేషన్ కోర్సు ప్రవేశపెట్టినప్పుడు దాన్ని అభ్యసించడానికి వచ్చే మహిళల కన్నా పురుషులనే ప్రోత్సహించేవారమని, ప్రస్తుతం పరిస్థితి మారిందని ఆమె అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications