సెన్సెక్స్‌పై స్పెయిన్ దెబ్బ: సోమవారం భారీ పతనం

మారుతి, స్టెరిలైట్ షేర్లలో అమ్మకాలు ముమ్మరంగా సాగాయి. ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐటిసి, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఆర్ఐఎల్ నష్టాలు సెన్సెక్స్‌ను భారీగా కుంగదీశాయి. రిటైల్ ఎఫ్‌డిఐపై యుపిఎ మిత్రపక్షాల నుంచే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో రిటైల్ రంగంలోని షేర్ల ధరలు కూడా పతనమయ్యాయి. రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐని అనుమతించడం మన్మోహన్‌సర్కారుకు అంత ఈజీకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జూ చైనా నుంచి డిమాండ్ తగ్గడంతో స్టెరిలైట్, హిండాల్కో, జెఎస్‌డబ్ల్యుతో సహా మెటల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. జూ సింగపూర్ కేంద్రంగా ఉన్న సముద్ర గర్భ కేబుల్ సంస్థ ఫ్లాగ్ టెలికామ్ పబ్లిక్ ఇష్యూను వాయిదా వేస్తూ ఆర్‌కామ్ తీసుకున్న నిర్ణయం కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్‌కామ్ షేరు ధర సోమవారం నాడు 4 శాతం మేర పతనమై 61.35 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక రంగంలోని అనిశ్చితి మార్కెట్ పరిస్థితులు ఆశించిన విధంగా సానుకూలంగా లేకపోవడంతో ఆర్‌కామ్ ఇష్యూను వాయిదా వేసుకుంది. దాదాపు 100 కోట్ల డాలర్లను సమీకరించేందుకు వీలుగా ఫ్లాగ్ టెలికామ్ ఇష్యూకు సిద్ధమైంది.
జూ రిటైల్ ఎఫ్‌డిఐ ప్రతిపాదనకు అసాధారణ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో సోమవారం నాడు రిటైల్ స్టాక్స్ బాగా దెబ్బతిన్నాయి. పాంటలూన్, ప్రొవోగ్ ఇండియా షేర్ల ధర 7-8 శాతం మేర పతనమైంది. షాపర్స్‌స్టాప్, బ్రాండ్‌హౌజ్, కౌటన్ షేర్ల ధర 5-6 శాతం మేర పతనమైంది. రిటైల్ ఎఫ్‌డిఐకి ప్రతిపక్షాల నుంచి పూర్తి స్థాయిలో ప్రతికూలత వ్యక్తమైంది. జూ మానేసర్ ప్లాంట్ నిరవధిక మూతతో మారుతి సుజుకి షేరు ధర 5 శాతం మేర పడిపోయింది.


Click it and Unblock the Notifications