
ఆయన బోర్డు పదవులను వదులుకోవడం న్యూ స్ పేపర్ గ్రూప్‌ను విక్రయించే యోచనలో ముర్దోక్ ఉన్నారన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. 81 ఏళ్ల ముర్దోక్ గత జూన్‌లో మాతృసంస్థ న్యూస్ కార్పొరేషన్‌కు చెందిన ఫిల్మ్, టెలివిజన్ డివిజన్ల నుంచి న్యూస్‌పేపర్స్ విభాగాన్ని వేరుచేస్తున్నట్లుగా ప్రకటించడం తెలిసిందే.
రూపర్ట్ మర్డోక్ న్యూస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. తన న్యూస్ కార్పొరేషన్ నిర్వహణలోని బ్రిటన్ పత్రికలు ది సన్, ది టైమ్స్, ది సండే టైమ్స్‌కు చెందిన పలు కంపెనీల డైరెక్టర్ పదవులకు ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని న్యూస్ ఇంటర్నేషనల్ మహిళా ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
దీనిపై ఆమె మాట్లాడుతూ - బ్రిటన్‌లోని పలు కంపెనీ బోర్డుల డైరెక్టర్ పదవులకు మర్డోక్ గత వారం రాజీనామా చేశారని ఆమె ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియాలోని పలు కంపెనీల బోర్డుల నుంచి ఆయన వైదొలిగినట్లు వెల్లడించారు.
షేర్ హోల్డర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి కారణంగా న్యూస్ కార్పోరేషన్‌ను విభజించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచురణ వ్యాపారంలో అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, పుస్తకాలు, విద్య, మార్కెటింగ్ ఆస్తులుంటాయి. మీడియా, ఎంటర్టైన్‌మెంట్ కంపెనీలో సినిమా, టీవి ఆస్తులుంటాయి. 81 ఏళ్ల ముర్దోక్ గతవారమే చాలా బోర్డుల నుంచి తప్పుకున్నారు. అవన్నీ చాలా వరకు అనుబంధ సంస్థలే.


Click it and Unblock the Notifications