
2011-12 Q1తో పోల్చితే 2012-13 Q1లో కంపెనీ ఆదాయం 31.6 శాతం వృద్ధి చెందగా, నికర లాభం 141 శాతానికి పెరగిందని అన్నారు. గత ఐదు త్రైమాసికాల్లోకి Q1లో అత్యధికంగా 915 మంది (నికరంగా 464) ఉద్యోగులను నియమించామని కంపెనీ తెలిపింది. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 9,800కు చేరారని ... ఉద్యోగులకు వేతనాలు సవరిస్తామని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు వేతనాలు పెంచినట్లు ఇన్ఫోటెక్ ప్రకటించింది.
ఈ త్రైమాసికంలో 17 మంది కొత్త క్లయింట్లు లభించడంతో వ్యాపారం జోరందుకుందని వ్యాల్యూమ్స్ పెరిగాడంతో పాటు లాభాలు కూడా పెరిగాయిని అంతర్జాతీయ మార్కెట్లలో మాంద్యం ఉన్నా దాని ప్రభావం తమ కంపెనీపై లేదని ఇన్ఫోటెక్ సీఎండీ బీ వీ మోహన్‌రెడ్డి చెప్పారు. తమ కంపెనీకి ఆర్డర్ల కొరత లేదని విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని వచ్చే త్రైమాసికంలో లాభాలు మరింత పెరగుతాయని ఆయన తెలిపారు. కంపెనీ చేతిలో నగదు నిల్వలు రూ.482 కోట్ల వరకు ఉన్నాయని, ఇటీవల కాలంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కార్లీలో 9.9 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
జపాన్, మలేసియాకు తోడు దక్షిణ కొరియా, చైనాల్లోనూ తమ ఉనికిని పెంచుకొంటున్నామని... అట్రిషన్ రేటు 14.3 శాతానికి తగ్గిందన్నారు.ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కొత్త కార్యాలయం, నోయిడాలో ఎస్‌ఈజెడ్, హైదరాబాద్‌లోని ఎస్‌ఈజెడ్‌లో మేజర్ క్లయింట్ల కోసం సీవోఈలు, ఫ్లోరిడాలో కొత్త కార్యాలయం ప్రారంభమయ్యాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications