
రోజు రోజుకీ దిగజారుతున్న వృద్ధిరేటుకు ఊతమిచ్చే దిశగా ఈ నెల 31న జరగబోయే త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో పాలసీ రేట్లను తగ్గించాలన్న డిమాండ్లపై దువ్వూరి సుబ్బారావు ఘాటుగా స్పందించారు.
పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి మందగమనానికి పాలసీ రేట్లు ఒక్కటే కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక పరిణామాలు మనదేశంపైనా ప్రభావం చూపుతాయని అన్నారు. వృద్ధిరేటు మందగించడానికి పలు కారణాలున్నాయి వాటిలో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు కూడా ఒకటని, ఐతే కేవలం ఆర్‌బీఐ వడ్డీరేట్లు పెంచినందుకే దేశ జీడీపీ వృద్ధిరేటు తగ్గిందనడం మాత్రం సరైన కారణం కాదన్నారు.
ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలిచేందుకు వాడుతున్న టోకు ధరల సూచికతో వాస్తవ ధరా కదలికలను అంచనా వేయలేకపోతున్నామని, ఉత్పత్తి ధరల సూచికను (ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ - పిపిఐ) తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయ పడింది. దేశంలో తయారవుతున్న ఉత్పత్తులు, అందుతున్న సేవలపై మారుతున్న ధరల సరాసరిని సమయా నుసారం ఖచ్చితంగా తెలుసుకో వాలంటే పిపిఐ విధానాన్ని అవలంభిం చాలని అన్నారు.
ఇప్పుడు వాడుతున్న టోకు ధరల సూచికతో స్పష్టమైన సమాచారం రావడం లేదని, ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు ప్రొడక్టులు అందే తరుణంలో ధరలు ఎంత మారుతు న్నాయన్నదీ తెలియడం లేదని ఆయన అన్నారు.
ప్రభుత్వ సబ్సిడీలు, అమ్మకపు పన్నులు, ఎక్సయిజ్ సుంకాలు, డిస్ట్రిబ్యూషన్ ఖర్చులతో సెల్లర్స్, పర్చేజర్స్ ధరల్లో వ్యత్యాసం చాలా ఎక్కువగా వుంటోందని గుర్తు చేశారు. వీటిని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా వుందని, ఈ కారణాలతోనే పిపిఐ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చానని తెలిపారు. ఉత్పత్తి ధరల సూచికను వాడటం ద్వారా ద్రవ్యోల్బణంపై ఒక అంచనా వస్తుందని, టోకు ధరల సూచికతో పోలిస్తే ఇందులో ఒడిదుడుకులు తక్కువగా నమోదవుతాయని ఆయన అన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications