
1990 నుంచి రెండు దశాబ్దాల వ్యవధికి చూస్తే దేశ జీడీపీ వృద్ధిలో ప్రభుత్వ రంగ వాటా 6% వద్దే నిలిచిపోయింది. ఇదే 90వ దశకంలో ప్రైవేటు రంగ జీడీపీ వృద్ధి 5.7% కాగా, 2000 దశాబ్దిలో 7.7%కు ఎగబాకింది. 2004-05 నుంచి 07-08 మధ్య అయితే ప్రైవేటు రంగ పనితీరు భారీగా మెరుగుపడి 9.7%కు కూడా దూసుకెళ్లింది. కార్పొరేట్ పెట్టుబడులు కూడా జీడీపీలో 10.3% స్థాయి నుంచి 17.3%కు పుంజుకున్నాయని క్రిసిల్ తెలిపింది. దీనితో పాటు ఆర్థిక సంక్షోభం నెలకొన్న 2008-09లో వీటి వాటా జీడీపీలో 11.3 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది.
2008 సంక్షోభ సమయంలో ప్రభుత్వ వ్యయం కారణంగానే వృద్ధిరేటు తీవ్రంగా పడిపోకుండా కాపాడిందని క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ ధర్మకీర్తి జోషి అభిప్రాయపడ్డారు. ఎగబాకుతున్న ద్రవ్యలోటు, ఇతరత్రా ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా వ్యయం పెంపు ద్వారా జీడీపీలో ప్రభుత్వ రంగ వాటాను పెంచే పరిస్థితులు లేవని చెప్పారు. 2009-10లో ప్రభుత్వ రంగ జీడీపీ వృద్ధి 14.5 శాతం నుంచి 2011-12లో 6.5 శాతానికి పడిపోవడాన్ని క్రిసిల్ గుర్తు చేసింది.
ఇది ఇలా ఉంటే దేశ జీడీపీ వృద్ధిరేటు 2008 సంవత్సరం కంటే ముందు ఉన్న దాని కంటే ఒక పర్సేంటేజీ పాయింట్ తగ్గి 7.5 శాతానికి పరిమితం కావచ్చునని ఆర్‌బీఐ గవర్నర్ సుబ్బరావు అన్నారు. తాజా అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతం కంటే కూడా తగ్గవచ్చునని అన్నారు. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంటో ఆరవ గణాంకశాస్త్ర రోజు సందర్భంగా సుబ్బరావు మాట్లాడుతూ చెప్పారు. ద్రవ్యోల్బణంపై ప్రభావం పడకుండా వృద్ధిరేటు సాధించాలన్నారు.
అంతర్జాతీయ ఏర్పడిన ఆర్థిక మాంద్యానికి ముందు వృద్దిరేటు 8.5 శాతంగా అంచనా వేశామని అయితే ఆర్థిక మాంద్యం సమయంలో 8 శాతంగా నమోదైంది. అధికార గణాంకాల ప్రకారం మే నెలలో జీడీపీ వృద్ధిరేటు 2012 ఆర్థిక సంవత్సరానికి తొమ్మిది నెలల కనిష్ఠానికి 6.5 శాతానికి పడిపోయిందని తెలిపింది. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం సమయంలో 6.7 శాతం కంటే కూడా తగ్గుముఖం పట్టింది. అంత ర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభం ప్రభావం తప్పకుండా భారత్‌పై కూడా ఉంటుందని సూబ్బారావు అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications