
అన్ని రంగాల్లోనూ పటిష్టమైన పనితీరుతో పాటు రూపాయి మారకం విలువ భారీగా తగ్గడం కూడా కంపెనీ ఆకర్షణీయమైన పనితీరుకు ప్రధానంగా దోహదం చేశాయి. నిపుణులు, విశ్లేషకులు టీసీఎస్ క్యూ1లో సగటున రూ. రూ.3,250 కోట్ల నికర లాభాన్ని, రూ.14,806 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే కంపెనీ ఫలితాలను ప్రకటించడం గమనార్హం. ఒకపక్క, అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూల పరిస్థితులతో ఇన్ఫోసిస్ గెడైన్స్‌ను తగ్గించడం, త్రైమాసికంగా లాభం, ఆదాయాల్లో తగ్గుదలను ప్రకటించినప్పటికీ... టీసీఎస్ మాత్రం మెరుగైన పనితీరును కనబరచడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
2011-12 ఆఖరి త్రైమాసికం(Q4)తో పోల్చినా టీసీఎస్ తన సత్తా చాటింది. Q4లో లాభం రూ. 2,932 కోట్లతో పోలిస్తే... ఈ ఏడాది క్యూ1 లాభం 13 శాతం మేర ఎగబాకడం విశేషం. అదేవిధంగా త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం కూడా 12.14 శాతం దూసుకెళ్లింది. క్రితం క్యూ4లో ఆదాయం రూ.13,259 కోట్లుగా నమోదైంది. అదే విధంగా గడిచిన త్రైమాసికంలో అదనంగా 13,831 ఉద్యోగులను కొత్తగా తీసుకున్నామని చెప్పారు.. ఇదే సమయంలో కంపెనీకి 29 మంది క్లయింట్స్ పెరిగారని పేర్కొన్నారు. అన్ని సేవల్లోను బలమైన వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్ మార్కెట్లు అనిశ్చితి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని, లేకపోతే తమ ఉద్యోగుల వేతనాల పెంపుదలపై ప్రభావం చూపుతుందని చంద్రశేఖరన్ అన్నారు.
కంపెనీ స్థూలంగా 13,831 మంది ఉద్యోగులను జత చేసుకుంది. అయితే వలసలను తీసేస్తే నికరంగా 4,962 నియామకాలు జరిగాయి. జూన్ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,43,545కు చేరుకుంది. మార్కెట్లు ముగిశాక టీసీఎస్ ఫలితాలను ప్రకటించింది. గురువారం కంపెనీ షేరు బీఎస్‌ఈలో 1.80% క్షీణించి రూ.1,236 వద్ద స్థిరపడింది. ఇది ఇలా ఉంటే 2012-2013 ఆర్దిక సంవత్సరానికి సంబంధించి ఇన్పోసిస్ విడుదల చేసిన Q1 త్రైమాసిక ఫలితాలు స్టాక్ మార్కెట్లను నిరూత్సాహాపరిచాయి. Q1లో ఇన్పోసిస్ నికరలాభం 32.93 శాతం పెరిగి 2,289 కోట్లను ఆర్జించింది. ఈ ఫలితాలు గతయేడాదితో పోలిస్తే 1.16 శాతం తగ్గాయి.
అసలే ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలు వస్తున్న సందర్బంలో ఇన్పోసిస్ Q1 త్రైమాసిక ఫలితాలు మరింతగా నిరాశపరిచాయి. ఇక ఆదాయం 8.63 శాతం పెరిగి 9,616 కోట్లకు చేరుకుంది. ఐతే నిపుణులు అంచనా వేసిన ఆదాయం, నికర లాభం రెండూ కూడా తక్కువగా వచ్చాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications