
గురువారం నాడు కేంద్రం విడుదల చేసిన గణాంకాల మేరకు కాపిటల్ గూడ్స్ సెక్టారులో వృద్ధి 7.7 శాతం దిగజారగా... గనుల రంగంలో ఉత్పత్తి 1.8 శాతం నుంచి 0.9 శాతానికి తగ్గింది. ఐఐపిలో 75 శాతానికి పైగా ప్రాతినిధ్యమున్న ఉత్పత్తి రంగం మే 2011లో 6.3 శాతం వృద్ధితో కొనసాగి ఈ సంవత్సరం 2.5 శాతంతో సరిపెట్టుకుంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో మాత్రం వృద్ధి రేటు 5.1 నుంచి 9.3 శాతానికి పెరిగింది. నాన్ డ్యూరబుల్స్ సెగ్మెంట్‌లో వృద్ధి 9 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో గ్రోత్ రేటు 10.3 నుంచి 5.9 శాతానికి పడిపోయింది.
మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో 22 ఇండస్ట్రీ గ్రూప్‌లుండగా, 12 గ్రూప్‌లు పాజిటివ్ వృద్ధిని సాధించాయి. బేసిక్ గూడ్స్ విభాగంలో 4.1 శాతం, ఇంటర్‌మీడియేట్ గూడ్స్ సెక్టార్ 2.7 శాతం పెరిగాయి. మొత్తంమీద కన్స్యూమర్ గూడ్స్ సెక్టారులో వృద్ధి 7.2 నుంచి 4.3 శాతానికి తగ్గింది. ఇదిలావుండగా, రేడియో, టివి, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ విభాగం అత్యధికంగా 16.4 శాతం వృద్ది రేటును సాధించగా, మెషినరీ అండ్ ఎక్విప్‌మెంట్ విభాగంలో 13.7 శాతం, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తుల రంగంలో 12.6 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ మెషినరీ రంగంలో మైనస్ 28.6 శాతం, ఫర్మీచర్ తయారీ రంగంలో మైనస్ 14.9 శాతం వృద్ధి నమోదైంది.
దీంతో జులై 31న జరగనున్న విధాన సమీక్షలో బహుశా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం వుండవచ్చు. వృద్ధి మందగమనం నేపథ్యంలో పాలసీ రేట్లను ఆర్‌బీఐ పావుశాతం మేర తగ్గించవచ్చనేది కొందరు నిపుణుల అంచనా. అయితే ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలోనే ఉన్నందున పాలసీ రేట్లను తగ్గించకపోవచ్చని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలావుండగా, ఐఐపీ వృద్ధి పడిపోవడం పట్ల వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనంద్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. రేట్లు తగ్గించాలని ఆర్‌బీఐని ప్రభుత్వం కోరుతుందని తెలిపారు.
ఇదిలావుండగా, మే నెల ఐఐపీ గణాంకాలపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా దేశ వ్యవస్థకు ఇదే శుభవార్తగా భావించాలని, ఏప్రిల్‌తో పోలిస్తే మే నెల ఫర్వాలేదనిపించేలా వుందని ఆయన అన్నారు. అక్టోబర్ నాటికి పూర్వపు వృద్ధి రేటును చూస్తామన్న నమ్మకం తనకుందని తెలిపారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టారు పనితీరును సమీక్షించిన తర్వాత గవర్నమెంట్ తరపున తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తామన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications