భారత్ పెట్టుబడులకు సానుకూలంగా వ్యవహరిస్తుంది: మన్మోహాన్

Prime Minister Manmohan Singh assures Singapore: India is 'investment-friendly'
న్యూఢిల్లీ, జులై 12: విదేశీ పెట్టుబడిదారులకు భారత్ సానుకూల దేశమని ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ సింగపూర్ ప్రధాని లీ సీయిన్ లూంగ్‌కి చెప్పారు. బుధవారం ఇరుదేశాల ప్రధాన మంత్రులు భేటీ సందర్బంగా ప్రధాని ఈ విషయాన్ని తెలిపారు. అంతక ముందు సింగపూర్ ప్రధాని భారత్‌లో విదేశీ పెట్టుబడి దారులకు భారత్‌లో వ్యాపారాలు చేయాలంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించగా... ఈ నేపథ్యంలో మన్మోహాన్ ఈ విధమైన హామీని ఇచ్చారు. భారత్ - సింగపూర్ మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి.

రక్షణ, భద్రతపరమైన రంగాలతో పాటు మొత్తం మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్‌కు సింగపూర్‌ నుంచి పెద్ద ఎత్తున ఎఫ్‌డీఐ వస్తుందని ప్రధాని అన్నారు. సింగపూర్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మన్మోహన్‌సింగ్‌ సింగపూర్‌ ప్రధాని లూంగ్‌ను కోరారు. ఇరు ప్రధానుల మధ్య అంతర్జాతీయ, ప్రాంతీయ దైపాక్షిక అంశాలపై సమగ్రచర్చలు జరిగాయి. ఆసియాలో భారత్‌కు సింగపూర్ అత్యంత ప్రధాన వాణిజ్య భాగస్వామి.

భారత్‌లోకి వచ్చే ఎఫ్‌డీఐలకూ ఇది ప్రధాన కేంద్రం. సరుకుల వాణిజ్యం, సేవలు, పెట్టుబడులను మరింత పెంచుకునేందుకు ఉద్దేశించిన సమగ్ర ఆర్థిక సహకార ఒప్పం దంపై ప్రస్తుత రెండో విడత సమీక్షను ముగించే అంశంపై కూడా మా మధ్య అంగీకారం కుదిరింది. భారత్ పెట్టుబడులకు సానుకూలంగా వ్యవహరించేలా కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నా. సింగపూర్ కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులకు భారత్‌ను తగిన గమ్యంగా ఎంచుకుంటాయని భావిస్తున్నా అని విలేకరుల సమావేశంలో మన్మోహన్ చెప్పారు. సింగపూర్‌ ప్రధానమంత్రి మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేశారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+