ముంబై, జులై 12: దేశంలోనే అతి పెద్ద గృహ రుణాలు ఇచే సంస్థ హెచ్‌డిఎఫ్‌సి. రియాల్టీ రంగం పూర్తిగా కుంటుపడినప్పటికీ.. Q1లో మంచి ఫలితాలు సాధించింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో కంపెనీ నికరలాభంలో 18.6 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.1,002 కోట్లు సొంతం చేసుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే మొదటి Q1లో రూ.844.53 కోట్లు ఆర్జించింది. గరిష్ఠ ఆదాయం రూ.4,942.31 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.3,821.6 కోట్లని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ ఎస్ ఫారిఖ్ వ్యాఖ్యానించారు.
బుధవారం నాడు జరిగిన హెచ్‌డిఎఫ్‌సి వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మొత్తం ఆదాయం 3,821.6 కోట్ల నుంచి 4,942.31 కోట్ల రూపాయలకు పెరిగిందని వివరించారు. లోన్ బుక్ 1.24 లక్షల కోట్ల నుంచి 1.48 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని, ఇందులో అనుబంధ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు ఇచ్చిన రుణాలను కలపలేదని ఫారీఖ్ తెలిపారు. నికరంగా వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,372.55 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.1,170 కోట్లని ఆయన చెప్పారు. అలాగే పన్ను చెల్లింపులు కూడా గత ఏడాదిరూ.331 కోట్లు చెల్లించగా ఈ యేడాది రూ.378 కోట్లకు పెరిగిందన్నారు.
అంతకుముందు ఇటి నౌ నిర్వహించిన పోల్‌లో బ్యాంకు 18 శాతం వృద్ధిని సాధిస్తుందని, నికర లాభం 993 కోట్లకు చేరుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. కాగా, ఈ ఫలితాలు వెల్లడైన తరువాత బిఎస్‌ఇలో హెచ్‌డిఎఫ్‌సి ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 0.62 శాతం పెరిగి 678.30 రూపాయల వద్ద కొనసాగింది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
Q1లో హెచ్‌డిఎఫ్‌సి నికరలాభం18.6 శాతంవృద్ధి | HDFC Q1 profits surge; meets expectations | Q1లో మంచి ఫలితాలు సాధించిన హెచ్‌డిఎఫ్‌సి
Housing finance major HDFC reported profits in line with street expectations. The company reported a net profit of Rs 1001 crores for the first quarter 2012-2013, as against Rs 844 crores reported in the corresponding period of last year.
Story first published: Thursday, July 12, 2012, 10:08 [IST]
Other articles published on
Jul 12, 2012