
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు జారీ చేసిన రుణాలను తిరిగి రాబట్టుకోవడానికి బ్యాంకులు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమాని, లిక్కర్ సామ్రాట్ విజయ్ మాల్య అధీనంలోని స్థిరాస్తులను వేలం వేసేందుకు అంతక ముందు ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్, గోవాలోని విజయ మాల్య విలాస విడిదిని వేలం రూపంలో విక్రయించేందుకు బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. ఈ ఆస్తుల విక్రయం ద్వారా బ్యాంకులు రూ.120 కోట్ల వరకు వసూలు చేసుకునే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం 17 బ్యాంకుల కన్సార్టిం హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీని నియమించి ఈ రెండు ఆస్తుల విలువ కట్టామని తెలిపింది. ఈ 17 బ్యాంకులు కలిసి కింగ్‌ఫిషర్‌కు మొత్తం రూ.7,500 కోట్ల వరకు రుణాలిచ్చాయి. ఎస్‌బీఐకు రూ.1,400 కోట్లు, పీఎన్‌బీఐకి రూ.700 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.500 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.430 కోట్లు వరక బకాయిలు పడింది.
గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న కార్యాలయాన్ని విక్రయించుకొని మీ డబ్బు వసూలు చేసుకోవాల్సిందిగా తాము బ్యాంకులకు గురువారం భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బిఐ) సమక్షంలో జరిగిన సమావేశంలో సూచించామని తెలిపింది. అయితే బ్యాంకులు మాత్రం ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో కింగ్‌ఫిషర్ ఈ ప్రాస్తావన తెలేదని పేర్కొంది. ఈ రెండు ఆస్తులకు కింగ్‌ఫిషర్ చైర్మన్ విజయ్ మాల్యా స్వంత పూచీకత్తు కూడా ఇచ్చారని 2010 నవంబర్ నుంచి బ్యాంకుల వద్ద ఈ రెండు ఆస్తులను తనఖా పెట్టారని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఐతే పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని, 15 రోజల సమయం మిగిలే ఉందని గుర్తు చేశాయి.
తమ రుణాన్ని రాబట్టుకునేందుకు బ్యాంకులు కింగ్‌ఫిషర్ ఆస్తులను విక్రయిస్తున్నారన విషయాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తోసి పుచ్చింది. ఈ రెండు ఆస్తులను ఎప్పుడో తాము అమ్మకానికి పెట్టామని తెలిపింది. ముంబయిలోని కింగ్‌ఫిషర్ హౌస్, గోవాలోని ఒక విళ్లాను బ్యాంకులకు కొన్ని నెలల క్రితయే కుదవ పెట్టింది. బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం ముంబయి శివార్లలో ఉన్న కింగ్‌ఫిషర్ హౌస్ విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, గోవాలోని విల్లా ఖరీదు రూ.30 కోట్లు ఉంటుందని తెలిపింది.
రెండేళ్ళ క్రితం వరకు దేశీయ విమానయాన రంగంలో ద్వితీయ స్థానంలో దూసుకు పోయిన కింగ్‌ఫిషర్ ఇప్పుడు అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు బ్యాంకర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతుంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications