ఎన్‌ఆర్‌ఐల రెమిటెన్సులపై నో సర్వీస్ ట్యాక్స్

No service tax on NRI remittances: FinMin
న్యూఢిల్లీ, జులై 11: కొత్త సేవా పన్నుల నివేదిక ప్రకారం విదేశాల నుండి వచ్చే రెమిటెన్సులపై సేవా పన్ను ఉండదని సమాచారం. వివరాల్లోకి వెళితే కొత్తగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పన్ను నిబంధనలపై కొన్ని వర్గాల్లో ఆందోళన నెలకొన్న సందర్బంలో విదేశాల నుండి వచ్చే రెమిటెన్సులపై సేవా పన్ను ఉండదని కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు(Central Board of Excise and Customs) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సాధారణంగా రెమిటెన్సులనేవి డబ్బు రూపంలో ఉంటాయి కనుక.. దీనిని సేవా పన్ను క్రింద పరగిణంచబోమని.. కాబట్టి దీనిపై సేవా పన్నుని విధించబోమని తెలిపారు.

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన విధానం ప్రకారం ఎన్‌ఆర్‌ఐ స్వదేశానికి పంపే నిధులపై 12% పన్ను ఉండొచ్చని వార్తలలొచ్చిన విషయం తెలిసిందే. రెమిటెన్సులు ఎక్కువగా వచ్చే కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల సీఎంలు ఈ విషయాన్ని ప్రధాని మన్మోహన్ దృష్టికి తీసుకెళ్లడంతో సీబీఈసీ ఈ వివరణ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2011లో భారత్‌లోకి 64 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు వచ్చాయి.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+