న్యూఢిల్లీ, జులై 9: గత రెండు వారాల్లో స్టాక్ మార్కెట్ పనితీరుని బట్టి అత్యుత్తమ రాబడులను అందించిన పెట్టుబడి సాధనాలలో ఇండియన్ స్టాక్ మార్కెట్లకు ఏడో ర్యాంక్ లభించింది. అమెరికా, చైనాలతో పాటు యుకె, జపాన్‌లకన్నా మెరుగ్గా ఇండియా లాభాలను నమోదు చేసిందని బ్యాంక్ ఆఫ్ అమెరికా వెల్లడించింది. జనవరి నుంచి ఇప్పటివరకూ టర్కీ మార్కెట్ 29.2 శాతం పెరిగి ప్రధమ స్థానంలో నిలిచిందని, ఆపై పోర్చుగల్ ప్రభుత్వ బాండ్లు 24.7 శాతం రాబడిని అందించాయని తెలిపింది. సింగపూర్ స్టాక్ మార్కెట్ 17.3 శాతం, మెక్సికో ఈక్విటీలు 15.5 శాతం, ఆ దేశపు ప్రభుత్వ బాండ్లు 14.7 శాతం, టర్కీ గవర్నమెంట్ బాండ్లు 14.6 శాతం పెరిగాయని ఆ తరువాత ఇండియా 12.3 శాతం లాభాలను పంచిందని తెలియజేసింది.
ఈ కాలంలో 29%పైగా పుంజుకున్న టర్కీ స్టాక్ మార్కెట్ తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు అత్యధిక ఫలాలు దక్కిన సాధనాలపై బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ రూపొందించిన ర్యాంకింగ్ నివేదిక ఇంకా ఇలా పేర్కొంది. ఇండియా ప్రభుత్వ బాండ్లు మాత్రం 2.9% ప్రతిఫలాలతో 36వ స్థానంలో నిలిచాయి. అయితే చైనా, జపాన్ కార్పొరేట్ బాండ్లు, కెనడా, ఇండోనేసియా, ఇటలీ, బ్రెజిల్, పోర్చుగల్, స్పెయిన్ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే ఇండియా ప్రభుత్వ బాండ్ల లాభాలే అధికం కావడం ప్రస్తావించదగ్గ అంశం. డాలర్‌తో ఆయా దేశాల కరెన్సీ మారకపు విలువను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించినట్టు బిఒఎ వెల్లడించింది.
ఈ ర్యాంకింగ్స్ కేవలం జనవరి నుంచి తీసుకున్న సమాచారంతో తయారు చేశామని, అంతకుముందు సంవత్సరం పాటు భారత మార్కెట్ పనితీరు అధ్వాన్నంగా సాగిందని పేర్కొంది. ఒక వారంలో వచ్చిన రిటర్న్‌లను పరిశీలిస్తే భారత్ ఐదవ స్థానంలో నిలిచిందని తెలిపింది. 2012 ఆరంభం నుంచి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లలోకి నికరంగా 840 మిలియన్ డాలర్ల నిధులు వచ్చి చేరాయని తెలియజేసింది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
7వ స్దానాన్ని కైవసం చేసుకున్న భారత్ స్టాక్ మార్కెట్లు | Indian stocks 7th best performing globally in 2012 | ఇండియన్ స్టాక్ మార్కెట్లకు ఏడో ర్యాంక్
Indian stocks have emerged as the seventh best performer for global investors since the start of 2012, outshining the likes of the US, UK, China and Japan.
Story first published: Monday, July 9, 2012, 12:16 [IST]
Other articles published on
Jul 9, 2012