
బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం 17 బ్యాంకుల కన్సార్టిం హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీని నియమించి ఈ రెండు ఆస్తుల విలువ కట్టామని తెలిపింది. ఈ 17 బ్యాంకులు కలిసి కింగ్‌ఫిషర్‌కు మొత్తం రూ.7,500 కోట్ల వరకు రుణాలిచ్చాయి. ఎస్‌బీఐకు రూ.1,400 కోట్లు, పీఎన్‌బీఐకి రూ.700 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.500 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.430 కోట్లు వరక బకాయిలు పడింది.
గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న కార్యాలయాన్ని విక్రయించుకొని మీ డబ్బు వసూలు చేసుకోవాల్సిందిగా తాము బ్యాంకులకు గురువారం భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బిఐ) సమక్షంలో జరిగిన సమావేశంలో సూచించామని తెలిపింది. అయితే బ్యాంకులు మాత్రం ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో కింగ్‌ఫిషర్ ఈ ప్రాస్తావన తెలేదని పేర్కొంది. ఈ రెండు ఆస్తులకు కింగ్‌ఫిషర్ చైర్మన్ విజయ్ మాల్యా స్వంత పూచీకత్తు కూడా ఇచ్చారని 2010 నవంబర్ నుంచి బ్యాంకుల వద్ద ఈ రెండు ఆస్తులను తనఖా పెట్టారని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఐతే పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని, 15 రోజల సమయం మిగిలే ఉందని గుర్తు చేశాయి.
తమ రుణాన్ని రాబట్టుకునేందుకు బ్యాంకులు కింగ్‌ఫిషర్ ఆస్తులను విక్రయిస్తున్నారన విషయాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తోసి పుచ్చింది. ఈ రెండు ఆస్తులను ఎప్పుడో తాము అమ్మకానికి పెట్టామని తెలిపింది. ముంబయిలోని కింగ్‌ఫిషర్ హౌస్, గోవాలోని ఒక విళ్లాను బ్యాంకులకు కొన్ని నెలల క్రితయే కుదవ పెట్టింది. బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం ముంబయి శివార్లలో ఉన్న కింగ్‌ఫిషర్ హౌస్ విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, గోవాలోని విల్లా ఖరీదు రూ.30 కోట్లు ఉంటుందని తెలిపింది.
ముంబయిలోని కింగ్‌ఫిషర్ హౌస్ ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇక్కడి సిబ్బంది క్యూబే అనే ప్రాంతంలోని కొత్త కార్యాలయానికి ప్రాంతానికి మారారు. రెండేళ్ళ క్రితం వరకు దేశీయ విమానయాన రంగంలో ద్వితీయ స్థానంలో దూసుకు పోయిన కింగ్‌ఫిషర్ ఇప్పుడు అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు బ్యాంకర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతుంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications