
క్యాపిటల్ ఎకనమిక్స్ అనే గ్లోబల్ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ ‘ఎమర్జింగ్ ఆసియా ఎకనమిక్స్ అప్‌డేట్- వాట్స్ గాన్ రాంగ్ ఇన్ ఇండియా?' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. 2014 సాధారణ ఎన్నికలకు ముందు భారత్ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులేవీ ఉండకపోవచ్చని కూడా ఈ నివేదిక తేల్చిచెప్పింది. అదేవిధంగా 2014 తర్వాత కూడా ఆర్థిక సంస్కరణలు జోరందుకుంటాయా అనేది అనుమానాస్పదమేనని పేర్కొంది. క్యాపిటల్ ఎకనమిక్స్ సంస్థ సింగపూర్, లండన్, టొరంటోల్లోని కార్యాలయాల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల స్థూల పరిస్థితులను పరిశీలించి, రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది.
భారత్ జీడీపీ వృద్ధిరేటు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 9 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 5.3 శాతానికి పడిపోయింది. సంవత్సర ప్రాతిపదిక చూస్తే ఈ రేటు 5 శాతం కంటే దిగువకు పడిపోయినట్లు లెక్క. వృద్ధి దిగజారడానికి ప్రధానంగా తాజా క్వార్టర్‌లో పెట్టుబడుల్లో భారీ క్షీణితే(-1.9 శాతం) కారణం. 2012 ఆరంభంలో భారత్ వృద్ధిరేటు 7.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేయగా, ఇప్పుడు 6.3 శాతం ఉంది.
మల్టీబ్రాండ్ రిటైల్, బీమాలోకి ఎఫ్‌డీఐల అనుమతి, దేశీయ ఎయిర్‌లైన్స్‌లోకి విదేశీ విమానయాన సంస్థల పెట్టుబడులకు ఆమోదం వంటి పలు హామీలను నిలబెట్టుకోలేకపోయింది. మరో రెండేళ్లలో(మే,2014) సాధారణ ఎన్నికలు వస్తున్నసమయంలో విధానపరమైన జడత్వం ఇంకా ఎక్కువగా పెరగొచ్చు. మరోవైపు, ప్రాంతీయ పార్టీలు అంతకంతకూ బలం పుంజుకుంటుండటంతో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లు ఏవైనా రానున్న కాలంలో సంకీర్ణ ప్రభుత్వాలనే తప్ప సొంతంగా అధికారంలోకి రావడం కష్టమే.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications