
ఇక ఈ ట్రేడింగ్‌లో భెల్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హీరో మోటార్‌కార్ప్, హిందుస్థాన్ యూనీ లీవర్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, ఐటీసీ, జిందాల్ స్టీల్, ఎల్ అండ్ టి, ఎం అండ్ ఎం, మారుతి సుజుకి, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు లాభపడగా, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, డీఎల్ఎఫ్, గెయిల్, హిండాల్కో కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.
ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించే అంశాన్ని యూపీఏ ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని గతంలో కేంద్రం చేసిన ప్రయత్నాలను మమతా బెనర్జీ తీవ్రంగా ప్రతిఘటించిన విషయం తెలిసిందే. విదేశీ కంపెనీలు వస్తే కిరాణా దుకాణాలు మూతపడతామని ఆమె వాదించారు. గతంలో వెనక్కు తగ్గిన మన్మోహన్ ప్రభుత్వం ఇప్పుడు రిటైల్ ఎఫ్‌డీఐని సీరియస్‌గా పరిశీలిస్తోంది.
ముందుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అనుమతించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గుజరాత్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా మల్టీబ్రాండ్ రిటైల్ ఎఫ్‌డీఐని స్వాగతిస్తాయని భావిస్తున్నారు. రిటైల్ ఎఫ్‌డీఐ వస్తే భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. వినియోగదారులకు ఛాయిస్ పెరుగుతుంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications