స్టాక్ మార్కెట్ కబుర్లు: లాభాల్లో ట్రేడవుతోన్న మార్కెట్లు

ప్రస్తుతం సెన్సెక్స్ 15,500లు సపోర్ట్‌గా, 17,900లు రెసిస్టెన్స్‌గా ఉందని ఆయన తెలిపారు. స్టాక్ మార్కెట్ లాభాలు 17,900ల వరకు వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చే అవకాశం ఉందని గప్సీ తెలియజేశారు. కొత్త బుల్ మార్కెట్ నిలబడాలంటే సెన్సెక్స్ 17,900లపైగా కొంత కాలం ఉండాలన్నారు. గతయేడాది ఆగస్టు నుండి సెన్సెక్స్ 15,500, 17,900 మధ్య ట్రేడ్ అవుతున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా మార్కెట్లు లాభపడడానికి ప్రభుత్వం నుండి సానుకూల వార్తలు రావడమేనని అన్నారు.
ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. యూరో జోన్‌లో వడ్డీ రేట్లు 0.25 శాతం తగ్గుతాయనే అంచనా. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ నుండి స్టిమ్యులస్ ప్యాకేజీ వస్తుందనే ఆశతో మే నెలలో అమెరికా తయారీ రంగ గణాంకాలు ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
యూరప్ మార్కెట్లలో జర్మనీ 1.35 శాతం లాభపడగా.. ప్రాన్స్ సూచీ 0.95 శాతం, బ్రటిన్ సూచీ 0.83 శాతం పెరిగాయి. తైవాన్, షాంఘై సూచీలు స్వల్పంగా నష్టపోతున్నాయి. సింగపూర్ నిప్టీ 20 పాయింట్ల దాకా లాభపడుతూ 5,315 పాయింట్ల సమీపంలో ట్రేడవుతోంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications