జూలై 1 నుండి మొదలైన 'సర్వీస్ ట్యాక్స్'

Most of the services to come under tax net from today
న్యూఢిల్లీ, జూన్ 2: కొత్త సర్వీస్ ట్యాక్స్ విధానం జూన్ 30 నుండి అమలులోకి వచ్చింది. ఐతే రైల్వే ఛార్జీల విషయంలో ఈ సర్వీస్ ట్యాక్స్ పెంపు ఇంకా వర్తించలేదు. రైల్వేలను ఈ ట్యాక్స్ నుండి మినహాయించారా లేదా అనే విషయంలో గందరగోళం నెలకొనడమే ఇందుకు కారణం అని అధికారులు తెలిపారు. ఒక వేళ ఈ విధానం అమల్లోకి వస్తే ఏసీ క్లాసు, ఫస్ట్ క్లాస్ ఛార్జీలు సుమారుగా 3.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. సరుకుల రవాణా, ప్రయాణికుల రవాణాను ప్రస్తుతం నెగిటివ్ లిస్ట్‌లో ఉంచారు.

గత శుక్రవారం ప్రధానమంత్రిని కలిసిన రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ ప్రయాణికుల ఛార్జీల పైనా, సరుకుల రవాణాపైనా సర్వీస్ ట్యాక్స్‌ను వేయవద్దని కోరారు. ఆర్దిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ రాజీనామా అనంతరం ఆ శాఖను మన్మోహాన్ సింగ్ చూస్తున్న విషయం తెలిసిందే. స్పీడ్ పోస్ట్, తపాలా కార్యాలయం అందించే ఎక్స్ ప్రెస్ పార్సిల్ సర్వీస్, టెలివిజన్-రంగస్దల కళాకారుల సంపాదన వంటివి జూలై 1 నుండి సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి చేరాయి. దీంతో నెగిటివ్ లిస్ట్‌లో ఉన్న 38 సేవలు మినహా అన్ని ఇతర కార్యకలాపాలపైనా 12 శాతం ట్యాక్స్ పడనుంది.

జులై 1వ తారీఖు నుండి విమాన టిక్కెట్లు, విదేశాలలో సెలవులు గడపడానికి ఆన్ లైన్ వెబ్ సైట్స్ నుండి కోనుగోలు చేసే ప్యాకేజిలు సర్విస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు జిఎమ్ఎటి, జీఆర్ఈల వంటి పరీక్షలు కూడా ఖరీదైనవిగా మారతాయి. ఐఐటీలు, ఐఐఎమ్‌లు లాంటి సంస్దల ప్రవేశపరీక్షను మాత్రం పన్ను నిండి తప్పించారు. దీనితో పాటు ప్రయివేట్‌గా ట్యూషన్‌లు చెప్పే వారి సంవత్సర ఆదాయం రూ 10 లక్షలకు మించితే సర్వీస్ ట్యాక్ కట్టాల్సి ఉంటుంది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+