మార్కెట్ కబుర్లు: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Euro Bank news fires sentiments across the globe; Asian markets awash in green
ముంబై, జూన్ 29: ఈరోజు భారత్ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్దిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్వెస్టర్లలో కొంత మేర విశ్వాసం కలుగుతోంది. స్టాక్ మార్కెట్‌ను సరైన మార్గంలో పెట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని మన్మోహన్ సింగ్ ఆర్దిక శాఖ అధికారులకు చెప్పడంతో మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇక సెన్సెక్స్ 355 పాయింట్లు లాభపడుతూ 17,346 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

నిప్టీ 107 పాయింట్ల దాకా లాభపడుతూ 5,257 పాయింట్ల సమీపంలో ట్రేడ్ అవుతుంది. అన్ని సెక్టోరియల్ సూచీలు ఈరోజు లాభాల్లోనే ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకులు, ఎఫ్ ఎంసీజీ, ఆటో షేర్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. గ్రూప్ ఎలో రిలయన్స్ క్యాపిటల్, వోల్టాస్, ఏబీబీ, సన్ ఫార్మా, రూరల్ ఎలక్టిఫికేషన్ షేర్లు 3 నుండి 4 శాతం పెరుగుతూ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. కెయిర్న్ ఇండియా షేరు 6 శాతం పడుతూ టాప్ లూజర్‌గా ఉంది. మణప్పరం పైనాన్స్ 4 శాతం, రాబర్ట్ బోష్ 1 శాతం పడుతున్నాయి.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+