లాభాల్లో స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్టర్ల కొనుగోళ్లు

Sensex
ముంబై, జూన్ 28: ఇండియన్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్ర్డేడ్ అవుతున్నాయి. ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో 46 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 17,014 ట్రేడ్ అవుతుంది. జపాన్ సూచీ ఒక శాతం దాకా పెరుగుతోంది. సింగపూర్ నిప్టీ 13 పాయింట్ల దాకా పెరుగుతూ 5, 154 సమీపంలో ట్రేడ్ అవుతుంది.

ఇక ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ సదస్సు నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతున్నారు. ఈ సదస్సులో యూరో జోన్ రుణ సమస్యకు పరిష్కార ప్రయత్నం జరుగుతుందనే ఉద్దేశ్యంతో మార్కెట్లు పెరుగుతున్నాయి. యూరోప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం దాకా లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు 0.7 శాతం పెరగగా.. దక్షిణ కొరియా, షాంఘై సూచీలు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ర్యాన్ బ్యాక్సీ పై సండూజ్ ఒక పిటీషన్ దాఖలు చేసింది. నెక్సియం ఔషధం జనరిక్ వెర్షన్‌కు ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకోవాలని ఈ పిటీషన్లో ఎఫ్‌డీఎని కోరింది. యూరియా ఉత్పత్తి కోసం రూ 40 వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించేందుకు కేంద్రం ఒక పాలసీని రూపొందించింది. యాక్సిస్ బ్యాంకు, యెస్ బ్యాంకుల్లో ఉన్న 245 కోట్లు రూపాయల షేర్లను అమ్మేందుకు హెచ్‌ఎస్‌బిసీ సిద్దమైంది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+