
ఏప్రిల్-జూన్ కాలానికి గతేడాది ఆదాయాల్లో సగటున 17.5% వృద్ధి నమోదుకాగా, ప్రస్తుతం 14%కు పరిమితంకావచ్చునని అభిప్రాయపడింది. ఇందుకు ఆర్థిక మందగమనం, స్థూల పెట్టుబడులు వంటి అంశాలు ప్రభావం చూపనున్నట్లు వెల్లడించింది. ఫలితంగా నిర్వహణ లాభాలు (ఇబిటా మార్జిన్లు) 1-1.5% వరకూ తగ్గవచ్చునని తెలిపింది.
ఐతే గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోలిస్తే ఇబిటా మార్జిన్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని వివరించింది. 26 రంగాలకు చెందిన మొత్తం 247 కంపెనీల ఆర్థిక ఫలితాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. కాగా, బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలను మినహాయించింది.
క్యూ1లో ఎయిర్‌లైన్స్, ఆటో విడిభాగాలు, వాణిజ్య వాహనాలు, హోటళ్లు, మెటల్స్, రిటైల్, రియల్టీ, టెక్స్‌టైల్స్ రంగాలు మందగించడంతో ఆదాయాలు బాగా తగ్గే అవకాశమున్నట్లు క్రిసిల్ పేర్కొంది. డిమాండ్ పడిపోవడం, పెరిగిన ముడిసరుకుల వ్యయాల కారణంగా వాణిజ్య వాహనాలు, సిమెంట్, నిర్మాణం, రియల్టీ తదితర రంగాలలోని కంపెనీల మార్జిన్లు 1-2% మధ్య తగ్గనున్నట్లు అంచనా వేసింది.
మరోవైపు ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీ సర్వీసులు, ఫార్మా రంగాలు మాత్రం ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించే అవకాశమున్నట్లు తెలిపింది. తాజా క్వార్టర్‌లో రూపాయి మారకపు విలువ 7.4% క్షీణించడంతో వీటి మార్జిన్లు మెరుగుపడనున్నాయని వెల్లడించింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications