RBI Alert: ఒకపక్క దేశంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత గత ఏడాది 2000 నోట్లను క్లీన్ నోట్ పాలసీ కింద వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు మీ వద్ద రూ.2000 రూపాయల నోట్లు ఉన్నట్లయితే ఈ వార్తమ మీకోసమే. ప్రస్తుతం చెలామణిలోంచి వెనక్కి తీసుకోబడిన 2000 నోటు మార్పిడి లేదా డిపాజిట్ సౌకర్యం రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది. అయితే దీనికి సంబంధించి ఆర్‌బీఐ కీలక సమాచారం ఇచ్చింది. ఇకపై ఏప్రిల్ 1న ఈ సదుపాయం అందుబాటులో ఉండదని రిజర్వు బ్యాంక్ తేల్చి చెప్పింది.

ఈ లెక్కన ఇప్పుడు 2000 నోట్లు కలిగి ఉన్న వారు తమ డబ్బును మార్చుకోవటం కుదరదన్నమాట. బ్యాంకుల్లో వార్షిక అకౌంటింగ్ పని కారణంగా రూ.2000 నోటు మార్పిడి లేదా డిపాజిట్ సౌకర్యం 1 ఏప్రిల్ 2024న అంటే సోమవారం అందుబాటులో ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలలో మరుసటి రోజు, మంగళవారం నుండి ఈ సదుపాయం తిరిగి ప్రారంభమవుతుందని తెలిపింది.
2023 మే 19న రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 29న వ్యాపారం ముగిసే సమయానికి రూ.2,000 నోట్లలో దాదాపు 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని, ఇంకా రూ.8,470 కోట్ల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. మార్చి 31 ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు, కానీ ఈ తేదీ ఆదివారం వస్తుంది. అందువల్ల ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంటాయి. ప్రభుత్వ పనుల కోసం ఆర్థిక సంవత్సరం చివరి రోజున బ్యాంకులు తమ కార్యాలయాలను తెరవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మార్చి 29 నుంచి 31 వరకు బ్యాంకులకు వరుస సెలవులు కావటంతో వినియోగదారులు పెద్ద ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications