For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Multicap Mutual Funds: అదిరిపోయే రిటర్న్స్ ఇస్తున్న మల్టీక్యాప్ ఫండ్స్ ఏవాంటే..?

|

స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరం తీవ్రమైన అస్థిరతను ఎదుర్కొంటోంది. ఇప్పటికే సెన్సెక్స్ 3.90 శాతం, నిఫ్టీ 50 3.74 శాతం తగ్గింది. అయితే మీ మొత్తం పోర్ట్‌ఫోలియోపై ఒక సెక్టార్ లేదా స్టాక్‌ల ప్రభావం పడకుండా ఉండేందుకు ఇప్పుడు మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడం ప్రారంభించడం ఉత్తమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇలానే మల్టీ-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫికేషన్ చూడొచ్చు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ అన్ని మేజర్, మిడ్, స్మాల్-క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెడతారు.

ఇది డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోతో దీర్ఘకాలంలో అత్యుత్తమ మార్కెట్ ఆధారిత రాబడిని ఇస్తుంది. SEBI నిబంధన ప్రకారం, మల్టీ-క్యాప్ ఫండ్‌లు తమ మొత్తం ఆస్తులలో 25 శాతం చొప్పున లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ సంస్థలలో లేదా కనీసం 65 శాతం ఈక్విటీలు & ఈక్విటీ-లింక్డ్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలి. ఫండ్ కేటగిరీని పరిగణనలోకి తీసుకుంటే, గత మూడేళ్లలో 31% వరకు SIP రాబడిని అందించిన రెండు మల్టీ-క్యాప్ ఫండ్‌లు ఏమిటో చూద్దాం.

క్వాంట్ యాక్టివ్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్-గ్రోత్
క్వాంట్ యాక్టివ్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్-గ్రోత్(Quant Active Fund) జనవరి 7, 2013న ప్రారంభమైంది. మార్చి 31, 2022 నాటికి, నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు (AUM) రూ.2,329.31 కోట్లుగా ఉన్నాయి. జూలై 1, 2022 నాటికి NAV రూ.392.05గా ఉంది. ఈ ఫండ్‌లో SIP కనీసం రూ. నెలకు 1000 నుంచి మొదలవుతుంది. దీని ఎక్స్ పెన్స్ రేషియో 0.58 శాతంగా ఉంది. ఈ ఫండ్ ప్రారంభం నుంచి ప్రతి సంవత్సరం సగటున 19.24 శాతం అందించింది.

2 multi cap mutual funds given up to 31 percent SIP returns in 3 years

ఫండ్ గత మూడేళ్లలో 31.49%, గత రెండేళ్లలో 21.41% గత ఐదేళ్లలో 24.43 శాతం SIP రాబడులను అందించింది. ఈ ఫండ్ తన పోర్ట్ ఫోలియోలో సేవలు, కన్స్యూమర్ స్టేపుల్స్, హెల్త్‌కేర్, ఫైనాన్షియల్, మెటల్స్ & మైనింగ్ రంగాలలో వైవిధ్యభరితంగా ఉంది. ఈ ఫండ్ టాప్ 5 హోల్డింగ్‌లు ITC Ltd., Vedanta Ltd., State Bank of India, Patanjali Foods Ltd., Larsen & Toubroలో ఉన్నాయి.

నిప్పాన్ ఇండియా మల్టీక్యాప్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్-గ్రోత్
ఈ ఫండ్ జనవరి 2, 2013న ప్రారంభమైంది. మార్చి 31, 2022 నాటికి, నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్-గ్రోత్(Nippon India Multicap Fund) నిర్వహణలో ఆస్తులు (AUM) రూ. 11638.57 కోట్లుగా ఉన్నాయి. ఈ ఫండ్ ఎన్ఏవీ రూ. 148.74గా ఉంది. ఈ ఫండ్‌లో మినిమమ్ SIP రూ. 500 మొదలవుతుంది. ఈ ఫండ్ ఎక్స్ పెన్స్ రేషియో 1.39 శాతంగా ఉంది. నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ డైరెక్ట్-గ్రోత్ ప్రతి సంవత్సరం సగటున 13.42 శాతం రాబడిని అందించింది.

2 multi cap mutual funds given up to 31 percent SIP returns in 3 years

ఫండ్ 2 సంవత్సరాలలో 22.67% SIP రాబడిని, 3 సంవత్సరాలలో 22.29% SIP రాబడిని అందించింది. ఈ ఫండ్ పోర్ట్ ఫోలియోలో ఆర్థిక, సేవలు, మూలధన వస్తువులు, సాంకేతికత, ఆటోమొబైల్ పరిశ్రమలకు సంబందించిన స్టాక్స్ ఉన్నాయి. ఫండ్ టాప్ 5 హోల్డింగ్‌లలో లిండే ఇండియా లిమిటెడ్, ICICI బ్యాంక్ లిమిటెడ్, HDFC బ్యాంక్ లిమిటెడ్, ఇండియన్ హోటల్స్ Co. Ltd., హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయి.

English summary

Multicap Mutual Funds: అదిరిపోయే రిటర్న్స్ ఇస్తున్న మల్టీక్యాప్ ఫండ్స్ ఏవాంటే..? | 2 multi cap mutual funds given up to 31 percent SIP returns in 3 years

Quant Active Fund - Direct Plan-Growth, Nippon India Multicap Fund - Direct Plan-Growth funds given up to 31% SIP returns in 3 years.
Story first published: Sunday, July 3, 2022, 9:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X