2022లో బ్యాంకింగ్ సెక్టార్ పాజిటివ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021 క్యాలెండర్ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా ఎగిశాయి. 2021లో 47,000 పాయింట్ల స్థాయిలో ప్రారంభమైన సెన్సెక్స్ ఇప్పుడు 58,000 స్థాయిలో ఉంది. ఓ సమయంలో 62,000 పాయింట్లు కూడా దాటింది. అయితే 2022లో సెన్సెక్స్ 70,000 పాయింట్లు మరింత ర్యాలీ చేస్తే 80,000 పాయింట్లకు చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులోను బ్యాంకింగ్ స్టాక్స్ ఈ కొత్త ఏడాదిలో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రధానంగా రెండు బ్యాంకింగ్ స్టాక్స్‌ను రిఫర్ చేస్తున్నాయి.

28 శాతం నుండి 42 శాతం రిటర్న్స్
ఈ మేరకు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రెండు బ్యాంకింగ్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇవ్వవచ్చునని చెబుతున్నాయి. యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. ఈ బ్రోకరేజీ సంస్థ యాక్సిస్ బ్యాంకు టార్గెట్ ధరను రూ.970, ఐసీఐసీఐ బ్యాంకింగ్ స్టాక్ టార్గెట్ ధరను రూ.949గా అంచనా వేస్తోంది. యాక్సిస్ బ్యాంకు స్టాక్ ప్రస్తుతం రూ.680 వద్ద ఉంది. ఈ బ్రోకరేజీ సంస్థ వేసిన టార్గెట్ అంచనా ధర 42 శాతం అధికం. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్ ప్రస్తుతం 740 వద్ద ఉంది. టార్గెట్ ధర 949 అంటే 28 శాతం అధిక రిటర్న్స్ ఇస్తుందని అంచనా.

యాకిస్స్ బ్యాంకు డిస్పర్స్‌మెంట్
బ్రోకరేజీ సంస్థ ప్రకారం కార్పోరేట్ లోన్ డిస్పర్స్‌మెంట్ త్రైమాసికం ప్రాతిపదికన 24 శాతంగా ఉండగా, ఏడాది ప్రాతిపదికన ఫ్లాట్‌గా ఉంది. మిడ్ కార్పోరేట్ సెగ్మెంట్ ఏడాది ప్రాతిపదికన 32 శాతం పెరగగా, త్రైమాసికం ప్రాతిపదికన 10 శాతం లాభపడింది. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ తాజా నివేదిక ప్రకారం యాక్సిస్ బ్యాంకు హోమ్ లోన్ డిస్పర్స్‌మెంట్ ఏడాది ప్రాతిపదికన 86 శాతం, త్రైమాసికం ప్రాతిపదికన 54 శాతం పెరిగింది. ఎస్బీబీ డిస్పర్స్‌మెంట్ ఏడాది ప్రాతిపదికన 103 శాతం, త్రైమాసికం ప్రాతిపదికన 72 శాతం లాభపడింది. లాంగ్ టర్మ్ రిటర్న్స్ టార్గెట్‌తో యాక్సిస్ బ్యాంకు స్టాక్‌ను రూ.970 టార్గెట్ వద్ద కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు.

ఐసీఐసీఐ బ్యాంకు వృద్ధి
ఐసీఐసీఐ బ్యాంకు గత రెండేళ్లుగా మంచి వృద్ధిని నమోదు చేస్తోంది. సేవింగ్స్ అకౌంట్, ఎఫ్‌డీ వ్యాల్యూ, లోన్ అప్రూవల్స్ అండ్ డిస్పర్స్‌మెంట్, కార్డ్స్ డిజిటల్ కాంట్రిబ్యూషన్ వరుసగా 28 శాతం, 25 శాతం, 23 శాతం, 45 శాతంగా నమోదయింది. సెప్టెంబర్ 2023 నాటికి ఈ స్టాక్‌ను రూ.949 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది.
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు నిపుణులు సలహాలు తీసుకోవాలి. అలాగే వాటి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.


Click it and Unblock the Notifications