LPG gas Prices: కొత్త ఏడాది శుభవార్త.. తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు..
LPG Price Today: కొత్త ఏడాది ప్రారంభమైంది. ఈ క్రమంలోనే జనవరి 1, 2024 నుంచి కొత్త గ్యాస్ ధరలు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ప్రతి నెల మాదిరిగానే చమురు కంపెనీలు నెల తొలిరోజున గ్యాస్ ధరల అమలులో మార్పులు తీసుకొచ్చాయి.
అంతర్జాతీయంగా గ్యాస్, చమురు ధరలు హెచ్చుతగ్గులు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఎల్‌పీజీ సిలిండర్ల ధరను తగ్గించింది. ఇది వినియోగదారులకు నూతన సంవత్సర కానుకగా అందించింది. ఆయిల్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలను ప్రకటించాయి. అయితే సామాన్యులు ఇంట్రో ఉపయోగించుకునే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. పెట్రోలియం కంపెనీలు కొత్త LPG గ్యాస్ సిలిండర్ ధరలను నేటి నుంచి అమలు చేస్తున్నాయి.

జనవరి 1, 2024 నుంచి LPG వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గడంతో చౌకగా మారాయి. దీంతో హోటళ్లు, స్వీట్ షాపులు, పెళ్లిళ్లలోకి వినియోగించే 19 కేజీల సిలిండర్లు వ్యాపారులకు కొంత ఊరటను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ గ్యాస్ సిలిండర్ల ధరలను స్వల్పంగా తగ్గించాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో నేటి ధరలను పరిశీలిస్తే.. దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కేవలం రూ.1.5 మాత్రమే తగ్గింది. అలాగే ముంబైలో తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర నేటి నుంచి రూ.1708.50కి అందుబాటులోకి రానుంది.
మెుత్తానికి కొత్త ఏడాది మెుదటి రోజున గృహ వినియోగదారులకు మాత్రం గ్యాస్ ధరల విషయంలో ఎలాంటి ఉపసమనం లభించలేదని చెప్పుకోవచ్చు. దీనికి ముందు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అలాగే ఉజ్వల వినియోగదారులకు ఆగస్టు మాసంలో డొమెస్టిక్ సిలిండర్లపై పెద్ద తగ్గింపును అందించింది. అలాగే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్యాస్ భారం పెరగకుండా కేంద్రం చర్యలు కొనసాగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు సైతం లీటరుకు రూ.4 నుంచి రూ.10 వరకు తగ్గించాలనే ఆలోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications