బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక చారిత్రాత్మక మలుపును చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఔన్సుకు దాదాపు 4,240 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇది కేవలం ఒక సాధారణ పెరుగుదల కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే, ఇది ఒక చారిత్రాత్మక సూపర్-ర్యాలీ ప్రారంభమైన సూచనగా నిపుణులు భావిస్తున్నారు. చాలా మంది విశ్లేషకులు ఈ ర్యాలీని 1979-1980 బంగారు బుల్ రన్‌తో పోల్చుతున్నారు. ఎందుకంటే ఆ కాలంలో జరిగినట్లే ఇప్పుడు కూడా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ అదే నమూనాను అనుసరిస్తోంది.
1979లో బంగారానికి చరిత్రలోనే అత్యంత దూకుడు ర్యాలీ వచ్చింది. ఆ సమయంలో, అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ద్రవ్యోల్బణ ఒత్తిడిలో ఉండగా, వడ్డీ రేట్లు భారీగా పెరిగి తగ్గుతూ ఉండడం, ఇరాన్ విప్లవం వంటి భూభౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత ఈ అంశాలన్నీ కలిసి బంగారం కేవలం ఒక్క సంవత్సరంలో దాదాపు రెండింతలు పెరగడానికి కారణమయ్యాయి. నేడు ఆ పరిస్థితులన్నీ తిరిగి ప్రపంచ మార్కెట్‌ను చుట్టుముట్టాయి. అందుకే బులియన్ నిపుణులు బంగారం 1979 కథ మళ్లీ రాస్తోందని అంటున్నారు.

ఈసారి ర్యాలీ వెనుక ఉన్న ప్రధాన కారకాల్లో మొదటిది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు అని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్ అంచనాల ప్రకారం ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల రేటును తగ్గించే అవకాశం 87 శాతంగా ఉంది. తక్కువ వడ్డీ రేట్లు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తాయి. ఎందుకంటే బ్యాంక్ డిపాజిట్ల లాభాలు తగ్గినప్పుడల్లా సురక్షిత ఆశ్రయంగా బంగారంపైనే పెట్టుబడులు పెరుగుతాయి. అంతేకాకుండా, అమెరికా ఆర్థిక డేటా బలహీనంగా రావడం, తయారీ కార్యకలాపాలు పడిపోవడం, GDP వృద్ధి మందగించడం, ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల వచ్చిన ప్రభావం ఈ అంశాలన్నీఫెడ్‌పై ఒత్తిడి పెంచింది. దీనివల్ల Gold ఇంకా బలమైన మద్దతు పొందుతోంది.
మరో శక్తివంతమైన అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు.. భారీగా బంగారం కొనుగోలు చేయండి.. చాలా దేశాలు అమెరికా డాలర్‌పై ఆధారపడటం తగ్గించడానికి, అంతర్జాతీయ రిజర్వుల భద్రత కోసం Gold నిల్వలను పెంచుతున్నాయి. టర్కీ, చైనా, ఇండియా వంటి దేశాలు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండటం ధరలను గణనీయంగా పైకి నెట్టింది. ఇదే పరిస్థితి 1979లో కూడా కనిపించింది.
ఇక ETF ఇన్‌ఫ్లోలు కూడా చాలా బలంగా ఉన్నాయి. గోల్డ్ ETFలలో భారీ నిధుల ప్రవాహం రావడం అంటే అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు బంగారం దీర్ఘకాల సూపర్ సైకిల్‌లోకి ప్రవేశిస్తుందనే నమ్మకం కలిగి ఉన్నాయని అర్థం. కొన్ని రోజుల క్రితం బంగారం ఔన్సు 4,380 డాలర్లకు తాకడం ఈ నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఇప్పటి పరిస్థితులను పరిశీలిస్తే తగ్గుతున్న వడ్డీ రేట్లు, బలహీనమైన డాలర్, అధిక ద్రవ్యోల్బణం, యుద్ధాలు & భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల రికార్డు స్థాయి కొనుగోళ్లు..ఈ అంశాలన్ని కలిసి 2025-26లో కొత్త బంగారు సూపర్ సైకిల్ ప్రారంభమవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజంగా ఇది 1979 తరహా చారిత్రాత్మక ర్యాలీ అయితే, రాబోయే నెలల్లో బంగారం మరింత కొత్త రికార్డులను తాకే అవకాశాలు ఉన్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications