Young Billionaire: 19 ఏళ్లకే ఫోర్బ్స్ జాబితాలోకి కుర్రోడు.. ప్రపంచ కోటీశ్వరుడిగా రికార్డు..
Young Billionaire: ఒకప్పుడు బిలియనీర్లుగా మారటానికి వ్యాపారులకు అనేక సంవత్సరాలు పట్టేది. కుబేరుడిగా గుర్తింపు తెచ్చుకోవటం కంటే దానిని నిలుపుకోవటం కష్టమని వారు ఇప్పటికీ భావిస్తూనే ఉంటారు.
ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాను విడుదల చేస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది యువత వేగంగా సంపద సృష్టించి బిలియనీర్లుగా మారి ఈ జాబితాలోకి వస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన లిస్టులో అందరి దృష్టి 19 ఏళ్ల క్లెమెంటే డెల్ వెచియోపై పడింది. ప్రపంచంలో అత్యంత పిన్న వయస్సులో దీనిని అందుకున్న వ్యక్తిగా డెల్ వెచియో నిలిచాడు.

క్లెమెంటే తండ్రి ఇటాలియన్ బిలియనీర్ డెల్ వెచియో. అతను ప్రపంచంలోనే అతిపెద్ద కంటి అద్దాల సంస్థ అయిన ఎస్సిలోర్‌లుక్సోటికా(Essilor luxottica)కు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన 87 ఏళ్ల వయస్సులో గత ఏడాది జూన్‌లో మరణించారు. డెల్ వెచియో నికర సంపంద 25.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయనకు భార్యతో పాటు ఆరుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో 2022లోనే ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా మారిన క్లెమెంటే కూడా ఉన్నాడు.
ప్రస్తుతం బిలియనీరుగా గుర్తింపు పొందిన క్లెమెంటే తన తండ్రి లక్సెంబర్గ్‌కు చెందిన డెల్ఫిన్ కంపెనీలో 12.5 శాతం వాటాను కలిగి ఉన్నాడు. ఫోర్బ్స్ ప్రకారం క్లెమెంటే డెల్ వెచియో నికర విలువ 4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంత మెుత్తంలో సంపదను కలిగి ఉన్నప్పటికీ క్లెమెంటే పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అతడికి ఎక్కువ మక్కువ.ఇటలీలో అనేక ఆస్తులు, విలాసవంతమైన రియల్టీ ప్రాపర్టీలు ఉన్నప్పటికీ క్లెమెంటే లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications