Tata Steel: టాటా స్టీల్‌కు చెందిన మేరమండలి ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 19 మంది కార్మికులు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వైద్యం కోసం హుటాహుటిన కటక్‌కు తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ప్లాంట్ లోని ఆవిరి పైపు పగిలి కొంత గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. టాటా యాజమాన్యం ఘటనపై అంతర్గత విచారణ జరుపుతోంది. స్థానిక మీడియా సమాచారం ప్రకారం ఒడిశాలోని దెంకనల్‌లోని కంపెనీ బ్లాస్ట్ ఫర్నేస్ పవర్ ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఇది జరిగిందని కంపెనీ వెల్లడించింది.

ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని వెంటనే ప్లాంట్‌లోని ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆపై వారిని అంబులెన్స్‌లో తదుపరి చికిత్స కోసం కటక్‌కు తరలించారు. దీనిపై సంబంధిత అధికారులతో కలిసి తాము పనిచేస్తున్నామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. భద్రత తమ మెుదటి ప్రాధాన్యతని.. ప్రమాదం అసలుఎందువల్ల జరిగిందో తెలుసుకుని దాని నుంచి నేర్చుకోవటనికి కట్టుబడి ఉన్నట్లు వారు వెల్లడించారు.
బ్లాస్ట్ ఫర్నేస్‌ను పరిశీలిస్తున్న కొందరు ఇంజనీర్లు, కార్మికులు ప్రమాద సమయంలో వేడినీరు వారిపై పడటంతో గాయపడ్డారని తెలుస్తోంది. మెుత్తం గాయపడ్డ 19 మందిలో ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది అక్కడి మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది. వేడి నీటిని తీసుకెళ్లే పైపులైన్ వాల్వ్ తెరుచుకోవడంతో తనిఖీకి వెళ్లిన సిబ్బంది గాయపడ్డారని దెంకనల్ ఎస్పీ జ్ఞానరంజన్ మీడియాకు తెలిపారు. దీనిపై అక్కడి జిల్లా యంత్రాంగ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టనుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications