అందరికీ తెలుసు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫేమస్, కానీ RBI 2019-20 Series-IV SGBల కోసం ప్రీమెచ్యూర్ రిడంప్షన్ అవకాశం అందిస్తోంది. అంటే, మీకు ఇష్టమైతే సాధారణ 8 సంవత్సరాల గోల్డ్ బాండ్ టెన్న్యూర్ ఉండగానే ముందే నిష్క్రమించే అవకాశం ఉంది.
ఈ సిరీస్ సెప్టెంబర్ 17, 2019న ప్రారంభం అయ్యింది, మరియు ప్రీమేచ్యూర్ రిడెంప్షన్ కోసం డేట్ సెప్టెంబర్ 17, 2025 అని RBI ప్రకటించింది. ప్రీమేచ్యూర్ రిడెంప్షన్ కోసం, ఈ బాండ్లు కనీసం 5 సంవత్సరాలు పూరై ఉండాలి.

SGB ప్రీమెచ్యూర్ రిడంప్షన్ ధర ఎంత?
RBI తాజాగా ప్రకటించిన ప్రకారం, 2019-20 Series-IV SGBలకు సెప్టెంబర్ 17, 2025న ప్రీమెచ్యూర్ రిడంప్షన్ చేసుకోవచ్చు. ఈ రోజు కోసం రిడెంప్షన్ ధర ప్రతి యూనిట్‌కు రూ. 11,003 గా ఫిక్స్ చేశారు. ఈ ధర నిర్ణయించిన విధానం కూడా ప్రత్యేకం సెప్టెంబర్ 12, 15, 16, 2025 బిజినెస్ డేస్‌లో క్లోజింగ్ గోల్డ్ ప్రైస్‌ల సగటు తీసుకుని లెక్కించబడింది.
ఈ బాండ్ 2019లో ప్రతి గ్రాముకు రూ. 3,890 8కి విడుదల అయి, ఇప్పుడు దీని సంపూర్ణమైన రాబడి రూ. 7,113 అని లెక్కపడింది. అంటే మొత్తం రాబడి సుమారుగా 183% ఇంట్రెస్ట్ వేరుగా ఉంది.
ఇది చూస్తే, ఫిజికల్ గోల్డ్ కొనడం కంటే ఎంత సులభంగా, రిస్క్ లేకుండా మంచి లాభాన్ని పొందవచ్చో స్పష్టమవుతోంది. గోల్డ్ స్టోరేజ్, స్వచ్ఛత, మేకింగ్ ఛార్జీలు వంటి సమస్యలు కూడా లేవు, అలాగే RBI/డిమాట్ ఖాతా ద్వారా సేఫ్‌గా మీ పెట్టుబడి ఉండటం, మార్కెట్ ప్రైస్‌ను గ్యారంటీ చేయడం వంటి అదనపు లాభాలు కూడా ఈ SGBలో ఉన్నాయి.
SGBలు 2.5% ఫిక్స్‌డ్ రేటుతో ప్రతి సంవత్సరం ఇంటరెస్ట్ ఇస్తాయి. ఈ ఇంటరెస్ట్ సెమీఅన్యువల్ గా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. చివరి ఇన్స్టాల్మెంట్ మెచ్యూరిటీ రోజున ప్రిన్సిపల్‌తో కలిపి చెల్లించబడుతుంది. అంటే మీరు బాండ్ నుండి కేవలం రాబడే కాక, వడ్డీ కూడా పొందగలుగుతారు.
SGB లు గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి చాలా సురక్షితమైన, సులభమైన ఆప్షన్‌గా మారాయి. ఫిజికల్ గోల్డ్ కొంటే ఉండే రిస్క్ ఇక్కడ దాదాపు ఉండదనే చెప్పాలి. అలాగే, బంగారం ఇంట్లో భద్రపరచడానికి వచ్చే స్టోరేజ్ ఖర్చులు, స్వచ్ఛత మీద డౌట్స్, మేకింగ్ ఛార్జీలు లాంటి తలనొప్పులు కూడా ఉండవు. ఈ బాండ్లు నేరుగా RBI బుక్స్‌లో లేదా మీ డిమాట్ ఖాతాలో సేఫ్‌గా ఉండటమే కాకుండా, చివరలో మార్కెట్ గోల్డ్ ప్రైస్ ఆధారంగా రాబడి ఖాయం అవుతుంది. అందుకే, గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి SGBలు ఒక సేఫ్, ఈజీ మరియు ప్రాఫిటబుల్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
ప్రీమెచ్యూర్ రిడంప్షన్ కోసం ఏమి చేయాలి. మీ బాండ్స్ ఏ ట్రాంచ్‌కు చెందుతాయో "జారీ తేదీ" చెక్ చేయాలి. రిడెంప్షన్ కోసం డెడ్‌లైన్‌కు ముందే RBI/బ్యాంక్‌కు రిక్వెస్ట్ సమర్పించాలి.
2019-20 Series-IV SGBలు సెప్టెంబర్ 17, 2025న ప్రీమేచ్యూర్ రిడెంప్షన్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ 183% రాబడి, సులభమైన లావాదేవీలు, రిస్క్ తక్కువ. అందువల్ల గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఇది నిజంగా మంచి అవకాశం. ఫిజికల్ గోల్డ్ కంటే అవాంతరం లేని, లాభదాయక మార్గంగా ఇది పెట్టుబడిదారుల కోసం ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications