Lottery: లాటరీలో జాక్ పాట్ మెుత్తంలో డబ్బులు సంపాదించారనే వార్తలు మనం సహజంగానే వింటుంటాం. అయితే ఇది ఒక్కరికో లేక ఇద్దరికో తగిలే అదృష్టమని భావిస్తుంటాం. అసలు రికార్డు స్థాయిలో ఒకే ఊరి నుంచి వందమందికి పైగా లాటరీ విజేతలుగా నిలిచి ధనవంతులయ్యారనేది వింటేనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మారిన తలరాత..
ఒక నివేదిక ప్రకారం.. ఒక గ్రామంలో నివసించే 165 మందికి అదృష్టం కలిసొచ్చింది. ఏకకాలంలో వారు రాత్రికి రాత్రే ధనవంతులయ్యారు. లాటరీలో ఏకంగా 165 మంది తలరాత మారిపోయింది. సమాచారం ప్రకారం వీరు గెలిచిన మెుత్తం లాటరీ సొమ్ము విలువ దాదాపు రూ.1,200 కోట్లు. అసలు ఈ సంఖ్య వింటేనే కళ్లు తిరిగిపోతున్నాయి.

ఒక్కొక్కరికి రూ.7.5 కోట్లు..
ఎక్కడైనా లాటరీ తగిలితే లక్షాధికారులు అవుతుంటారు. కానీ ఈ గ్రామంలో గెలుపొందిన ప్రతి వ్యక్తికి రూ.7.5 కోట్లకు పైగా డబ్బు గెలుపొందారు. యూరప్‌లోని బెల్జియంలోని ఆంట్‌వెర్ప్ ప్రావిన్స్‌లో ఉన్న ఓల్మెన్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అక్కడి ప్రజలందరూ లాటరీ గెలుపొందటంతో సంతోషంలో ఉన్నారు.

లాటరీలో అదృష్టం..
డైలీ మెయిల్ వార్తా సంస్థ ప్రకారం.. యూరోమిలియన్స్ లాటరీలో ఓల్మెన్ గ్రామానికి చెందిన 165 మంది ఈ బహుమతిని గెలుచుకున్నారు. ఈ వ్యక్తులు కలిసి లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. టిక్కెట్ కలిసి కొనుగోలు చేసేందుకు గ్రామంలోని ఒక్కొక్కరు రూ.1,308 చెల్లించారు. గత మంగళవారం ఫలితాలు వచ్చి లక్కీ డ్రా వివరాలు వెలువడ్డాయి. ఇందులో గ్రామస్తులు మెుత్తంగా 123 మిలియన్ పౌండ్లను ప్రైజ్ మనీగా గెలుపొందారు. ఇది భారతీయ కరెన్సీలో రూ.1,200 కోట్లకు సమానం.

సమానంగా పంపిణీ..
గెలుచుకున్న 123 మిలియన్ యూరోల ప్రైజ్ మనీని 165 మందికి పంచుతారు. అలా భారత కరెన్సీలో ఒక్కొక్కరికి సుమారు ఏడున్నర కోట్లు అందుతాయి. విశేషమేమిటంటే ఈ ప్రైజ్ మనీని అందరికీ సమానంగా పంచాలని సదరు గ్రామస్తులు ముందే నిర్ణయించుకున్నారు. లాటరీని కొనుగోలు చేయడానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్న వారు ఇప్పుడు దానినే ఆచరిస్తున్నారు. పండుగకు కొద్ది రోజుల ముందు తమకు ఈ అదృష్టం దక్కటంపై గ్రామంలోని కొందరు దీనిని 'ఉత్తమ క్రిస్మస్ కానుక'గా భావిస్తారు.

అతిపెద్ద బహుమతి..
ఇలాంటి భారీ మెుత్తాలను ప్రజలు గెలుచుకోవటం ఇదే తొలిసారికాదని జాతీయ లాటరీ ప్రతినిధి జాక్ వెర్మోర్ తెలిపారు. దీనికి ముందు బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ ఏడాది జూలైలో ఏకంగాన 195 మిలియన్ పౌండ్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ ఏకంగా రూ.19,000 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications