Success Story: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కనీసం రెండు పూటల తిండి తినేందుకు చాలా కష్టపడుతున్నారు. ఇందుకోసం పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా పనిచేస్తున్నారు.
కానీ ఒక కుర్రాడు మాత్రం 16 ఏళ్లకే కోటీశ్వరుడయ్యాడు. డబ్బు, సూపర్ కార్స్, ఖరీదైన ఇళ్లను కొంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. తనలాగే ఎవరైనా ధనవంతులు కావొచ్చని అంటున్నాడు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది డోనాల్డ్ డోఫర్ అనే అమెరికా కుర్రాడి గురించే. ఇతడి నెలవారీ ఆదాయం 20,000 డాలర్లు అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.16 లక్షలు.

ఇంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న డోనాల్డ్‌కు యూట్యూబ్‌లో ఛానెల్ ఉంది. 2019లో ఛానెల్ స్టార్ట్ చేశాడు. అందులో ట్రావెల్ వంటి వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాడు. ప్రస్తుతం అతడు తల్లిదండ్రులు, సోదరితో కలిసి లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్నాడు. తాను రోజంతా తన వ్యూవర్స్ కోసం వీడియోలు, కంటెంట్ గురించి ఆలోచిస్తానని చెబుతున్నాడు. స్కూల్ వర్క్ పూర్తైన తర్వాత వీడియోలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉంటాడు.
వారానికి ఒకటి లేదా రెండు వీడియోలను పోస్ట్ చేయటం ద్వారా ఒక్కో వీడియోకు అత్యధికంగా రూ.6 లక్షల వరకు ఆర్జిస్తున్నాడు. అతని తండ్రి డెవలపర్‌గా పనిచేస్తున్నారు. మొత్తం కుటుంబం ఆస్తుల విలువ 500 మిలియన్ డాలర్లుగా ఉంది. వీరి కుటుంబానికి కుటుంబానికి శాన్ డియాగోలో రెండు, లాస్ ఏంజిల్స్‌లో రెండు, న్యూయార్క్‌లో రెండు, బహామాస్‌లో ఒక ఇల్లు ఉన్నాయి. పైగా ఈ కుర్రాడు కోటీశ్వరులు కావటం వల్ల కలిగే నష్టాల గురించి కూడా చెబుతుంటాడు.

ఒక్కసారిగా తాను పేదవాడిగా మారినప్పటికీ బాగానే ఉంటానని చెబుతున్నాడు. ఎవరైనా ప్రయత్నిస్తే ధనవంతులు, ప్రసిద్ధులు కాగలరని తాను నమ్ముతానని అంటున్నాడు. అలా చేయటం అసాధ్యమని మన మనస్సు చెబుతుంటుందని.. కానీ ఖచ్చితంగా చేయగలమని అన్నారు. ఎంత ఎక్కువ పనిచేస్తే అంత ఎక్కువ పొందుతారన్నారు.


Click it and Unblock the Notifications